ఒకేసారి 3 సినిమాలతో బన్నీ హల్ చల్

సరైనోడు సక్సెస్ ఉత్సాహంలో వరుసగా సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తూ… ఓ రెండేళ్ల పాటు బిజీగా ఉండబోతున్నాడు బన్నీ. ఇప్పటికే లింగుస్వామి దర్శకత్వంలో మూవీ చేసేందుకు బన్నీ అంగీకరించాడు. ప్రస్తుతం విహార యాత్రలో ఉన్న ఈహీరో, అది ముగిసిన వెంటనే… లింగుస్వామితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. కేవలం ఈ సినిమాకే ఫిక్స్ అయిపోకుండా… వరుసగా మరో రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు. లింగుస్వామి సినిమా పూర్తయిన వెంటనే… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ […]

Advertisement
Update:2016-06-10 06:34 IST
సరైనోడు సక్సెస్ ఉత్సాహంలో వరుసగా సినిమాలకు కాల్షీట్లు కేటాయిస్తూ… ఓ రెండేళ్ల పాటు బిజీగా ఉండబోతున్నాడు బన్నీ. ఇప్పటికే లింగుస్వామి దర్శకత్వంలో మూవీ చేసేందుకు బన్నీ అంగీకరించాడు. ప్రస్తుతం విహార యాత్రలో ఉన్న ఈహీరో, అది ముగిసిన వెంటనే… లింగుస్వామితో కలిసి సెట్స్ పైకి వెళ్తాడు. కేవలం ఈ సినిమాకే ఫిక్స్ అయిపోకుండా… వరుసగా మరో రెండు సినిమాల్ని లైన్లో పెట్టాడు.
లింగుస్వామి సినిమా పూర్తయిన వెంటనే… విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు అల్లు అర్జున్. నిజానికి లింగుస్వామి సినిమా కంటే ముందే విక్రమ్ కుమార్ సినిమా సెట్స్ పైకి వెళ్లాల్సి ఉన్నప్పటికీ… స్క్రీన్ ప్లే రాసుకోవడానికి విక్రమ్ మరింత టైం అడగడంతో… ముందుగా లింగుస్వామికి అవకాశం దక్కింది. వీళ్లిద్దరితో సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత దర్శకుడు హరీష్ శంకర్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నాడు బన్నీ. ఎట్టకేలకు ఓ మంచి కథతో బన్నీని ఒప్పించగలిగాడు హరీష్. ఈమధ్యే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ డిస్కషన్స్ ముగిశాయని సమాచారం. హరీష్ చెప్పిన కథకు అరవింద్ కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. త్వరలోనే బన్నీ 3 సినిమాలకు సంబంధించి ఒకేసారి ప్రెస్ నోట్ విడుదలయ్యే అవకాశముంది.
Click on Image Read:
Tags:    
Advertisement

Similar News