రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతాం

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఈరోజు అందుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి ప్రజాసమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు. ప్రత్యేక హోదాకోసం పోరాడుతామని చెప్పారు. గత రెండు సవంత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇటీవల ఏపీనుంచి నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా […]

Advertisement
Update:2016-06-08 07:13 IST

రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికైన వైసీపీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఎన్నిక ధ్రువీకరణ పత్రాన్ని ఈరోజు అందుకున్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన విజయసాయిరెడ్డి ప్రజాసమస్యలపై తమ పోరాటం కొనసాగుతుందన్నారు. రాష్ట్రప్రయోజనాల కోసం కృషి చేస్తానన్నారు. ప్రత్యేక హోదాకోసం పోరాడుతామని చెప్పారు. గత రెండు సవంత్సరాల్లో టీడీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఇటీవల ఏపీనుంచి నాలుగు రాజ్యసభ స్థానాల భర్తీకి ఈసీ నోటిఫికేషన్ ఇవ్వగా కేవలం నాలుగు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. దీంతో విజయసాయిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయనతో పాటు టీజీ వెంకటేష్, సుజనా చౌదరి, కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News