అక్క‌డ బాహుబ‌లి, శ్రీ‌మంతుడు త‌రువాత  నితినే మొన‌గాడు..!

ఓవ‌ర్సీస్ లో   జెండా పాత‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఇక్క‌డ నుంచి అమెరికా వెళ్లి..అక్క‌డ ప‌లు ర‌కాల  ప్రొఫెష‌న్స్ లో సెట్ అయిన మ‌న ఎన్ ఆర్ ఐలు.. ఒక విధ‌మైన జీవిన విధానానికి అల‌వాటు ప‌డి వుంటారు. వాళ్లకు క‌నెక్ట్ అయ్యే విధంగా చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల్లో నెంబ‌ర్ వ‌న్ త్రివిక్ర‌మ్ అనే చెప్పాలి.   ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ విడుద‌లైన  తెలుగు చిత్రాల్లో  బాహుబ‌లి అత్య‌ధిక  వ‌సూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. బాహుబ‌లి ఓవ‌ర్సీస్ […]

Advertisement
Update:2016-06-07 16:30 IST

ఓవ‌ర్సీస్ లో జెండా పాత‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఇక్క‌డ నుంచి అమెరికా వెళ్లి..అక్క‌డ ప‌లు ర‌కాల ప్రొఫెష‌న్స్ లో సెట్ అయిన మ‌న ఎన్ ఆర్ ఐలు.. ఒక విధ‌మైన జీవిన విధానానికి అల‌వాటు ప‌డి వుంటారు. వాళ్లకు క‌నెక్ట్ అయ్యే విధంగా చిత్రాలు చేసే ద‌ర్శ‌కుల్లో నెంబ‌ర్ వ‌న్ త్రివిక్ర‌మ్ అనే చెప్పాలి. ఇప్ప‌టి వ‌ర‌కు అక్క‌డ విడుద‌లైన తెలుగు చిత్రాల్లో బాహుబ‌లి అత్య‌ధిక వ‌సూళ్లు చేసిన చిత్రంగా నిలిచింది. బాహుబ‌లి ఓవ‌ర్సీస్ లో 4. 4 మిలియ‌న్లు క‌లెక్ట్ చేయ‌గా…మ‌హేష్ బాబు శ్రీ‌మంతుడు 2.09 మిలియన్లు క‌లెక్ట్ చేయ‌గా.. ఇక మూడో స్థానంలో నితిన్ త్రివిక్ర‌మ్ కాంబినేష‌న్ లో వ‌చ్చిన అఆ చిత్రం నిలిచింది. ఈచిత్రం 1.7 మిలియన్ డాలర్లతో ‘అ.. ఆ’ మూడో స్థానాన్ని కైవసం చేసుకున్న‌ట్లు టాలీవుడ్ ట్రేడ్ ఎన‌లిస్ట్ త‌ర‌ణ్ ఆద‌ర్స్ ట్విట్ చేశారు.

1.63 మిలియన్ డాలర్లతో ‘నాన్నకు ప్రేమతో’, 1.52 మిలియన్ డాలర్లతో ‘అత్తారింటికి దారేది’ నిలిచాయి. అంచనాలు దాటి నితిన్ మూవీ ఈ రేంజ్‌లో వసూళ్లు సాధించడంతో ట్రేడ్ ఎనలిస్టులు కూడా ఆశ్చర్యపోతున్నారు. ఇక ఓవరాల్‌గా చూస్తే.. ఓవర్సీస్‌లో టాప్-5లోకి ‘అ.. ఆ’ చేరిపోయింది.

Tags:    
Advertisement

Similar News