రెజీనాతో నాకు ఎలాంటి ఎఫైర్ లేదు...

హీరోయిన్లు-ఎఫైర్లను అస్సలు విడదీయలేం. వానాకాలం ఎండ, వర్షాకాలం బురద ఎంత కామనో… హీరోయిన్లు-ఎఫైర్లు కూడా అంతే కామన్. అయితే ఇది మనం చెప్పుకునేంత పలచగా మాత్రం ఉండదు. ఆ పుకార్లను ఎదుర్కొంటున్న హీరోియిన్లు ఎంత ఇబ్బంది పడతారనే యాంగిల్ లో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఆ మధ్య రెజీనా కూడా ఇలానే ఇబ్బంది పడింది. మెగా కాంపౌండ్ కు చెందిన సాయిధర్మతేజతో రెజీనా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందంటూ చాలా కథనాలు వచ్చాయి. వెంటనే స్పందించిన రెజీనా అలాంటివేం […]

Advertisement
Update:2016-06-02 04:09 IST
హీరోయిన్లు-ఎఫైర్లను అస్సలు విడదీయలేం. వానాకాలం ఎండ, వర్షాకాలం బురద ఎంత కామనో… హీరోయిన్లు-ఎఫైర్లు కూడా అంతే కామన్. అయితే ఇది మనం చెప్పుకునేంత పలచగా మాత్రం ఉండదు. ఆ పుకార్లను ఎదుర్కొంటున్న హీరోియిన్లు ఎంత ఇబ్బంది పడతారనే యాంగిల్ లో కూడా ఆలోచించాల్సి ఉంటుంది. ఆ మధ్య రెజీనా కూడా ఇలానే ఇబ్బంది పడింది. మెగా కాంపౌండ్ కు చెందిన సాయిధర్మతేజతో రెజీనా పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయిందంటూ చాలా కథనాలు వచ్చాయి. వెంటనే స్పందించిన రెజీనా అలాంటివేం లేదంటూ ఆ వార్తల్ని ఖండించింది. దయచేసి అలాంటి రాతలు రాయొద్దని కూడా రిక్వెస్ట్ చేసింది. కానీ అడపాదడపా ఈ వ్యవహారంపై కథనాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి. దీంతో స్వయంగా సాయిధర్మతేజ రంగంలోకి దిగాడు. ఓ ఆంగ్ల దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయంపై చాలా ఆగ్రహం వ్యక్తంచేశాడు. తనకు రెజీనాతో సంబంధం ఉందనే వార్తల్ని ఖండించిన సాయిధర్మతేజ… మీడియాపై నిప్పులు చెరిగాడు. ఇలాంటి వార్తలు రాసేముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకోవాలని… అటువైపు ఓ అమ్మాయి ఉందనే విషయాన్ని మరిచిపోవద్దని మీడియా వాళ్లకు కాస్త ఘాటుగానే హెచ్చరికలు జారీచేశాడు. తను, రెజీనా మంచి స్నేహితులం మాత్రమేనని… ఈ పుకార్లు వచ్చినప్పటి నుంచి తమ మధ్య తెలియని దూరం పెరిగిందని బాధపడ్డాడు. కనీసం, సాయిధర్మతేజ ఇచ్చిన వివరణతోనైనా ఇలాంటి పుకార్లు ఆగిపోతాయని ఆశిద్దాం.
Click on Image:
Tags:    
Advertisement

Similar News