రేవంత్ కొంటానంటే.. కేసీఆర్ అమ్ముతాడా?

ఓటుకు నోటు కేసు ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. అది కూడా న‌గ‌దు ఆఫ‌ర్‌! రేవంత్ ఈసారి ఇస్తాన‌న్న డ‌బ్బు మాత్రం నేరుగానే ఇస్తాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. మెద‌క్ జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ కోసం భూ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం త్వ‌ర‌లోనే భూ సేక‌ర‌ణ కూడా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీన్ని ముంపు బాధిత గ్రామాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి.  సందు దొరికితే కేసీఆర్ […]

Advertisement
Update:2016-06-02 04:40 IST
ఓటుకు నోటు కేసు ప్ర‌ధాన నిందితుడు రేవంత్ రెడ్డి కేసీఆర్ కు బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చాడు. అది కూడా న‌గ‌దు ఆఫ‌ర్‌! రేవంత్ ఈసారి ఇస్తాన‌న్న డ‌బ్బు మాత్రం నేరుగానే ఇస్తాడ‌ట‌. ఇంత‌కీ అస‌లు విష‌యం ఏంటంటే.. మెద‌క్ జిల్లాలో నిర్మించ త‌ల‌పెట్టిన మ‌ల్ల‌న్న సాగ‌ర్ కోసం భూ సేక‌ర‌ణ చేప‌ట్టాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇందుకోసం త్వ‌ర‌లోనే భూ సేక‌ర‌ణ కూడా చేప‌ట్టాల‌ని నిర్ణ‌యించింది. దీన్ని ముంపు బాధిత గ్రామాలు తీవ్రంగా వ్య‌తిరేకిస్తున్నాయి. సందు దొరికితే కేసీఆర్ పై తిట్ల దండ‌కం అందుకనే రేవంత్ ఈ అంశంపై స్పందించాడు. ఇంకేం.. త‌న‌కు అల‌వాటున్న రీతిలోనే డ‌బ్బులు ఇస్తాన‌న్నాడు. ఎవ‌రికో కాదు.. ఏకంగా సీఎం కేసీఆర్‌కే.. అది కూడా ల‌క్ష‌ల డ‌బ్బు..
మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప‌రిధిలో భూములు కోల్పోతున్న రైతులుక ఎక‌రాకి రూ.10 ల‌క్ష‌ల చొప్పున ఇవ్వాలని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. అయితే, ఈ మొత్తం స‌రిపోద‌ని, స‌ర్కారు రూ.25 ల‌క్ష‌లు చెల్లించాల‌ని డిమాండ్ చేస్తున్నాడు రేవంత్‌. లేదంటే తాను కేసీఆర్ వ్య‌వ‌సాయ క్షేత్రంలో ఉన్న భూమిని తాను ఎక‌రం రూ.10 ల‌క్ష‌ల చొప్పున కొంటాన‌ని.. కేసీఆర్ అమ్ముతాడా? అని ఎద్దేవా చేశాడు. మల్లన్నసాగర్‌లో భూములు పోతే బాధిత రైతులు అడుక్కు తినాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. బంగారు తెలంగాణ అంటూ.. సంబరాలకు సిద్ధమవుతున్న పాలకులు.. ఈ గడ్డను బొందలగడ్డగా మార్చారని విమర్శించారు. అయితే, రేవంత్ వ్యాఖ్య‌ల‌ను గులాబీ నేత‌లు లైట్ తీసుకున్నారు. డ‌బ్బులతో దేన్న‌యినా కొన‌డం రేవంత్ తెలిసినంతగా త‌మ‌కు తెలియ‌ద‌ని ఎగ‌తాళి చేస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలులో జైలుకు వెళ్లొచ్చినా రేవంత్ బుద్ధి మార‌లేద‌ని మండిప‌డుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News