చైనా మార్కెట్ ను కూడా వదలని బాహుబలి
బాహుబలి సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. పలు దేశాల్లో కూడా అఖండ విజయం సాధించింది. కేన్స్ చిత్రోత్సవంలో కూడా ఈ సినిమాకు భారీ ప్రచారం కల్పించారు. కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా ఈ సినిమాను చూపించారు. తాజాగా ఈ సినిమా చైనా మార్కెట్ ను టార్గెట్ చేసింది. త్వరలోనే చైనాలో బాహుబలిని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ-స్టార్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి హక్కులు అమ్మేశారు. గతంలో అమీర్ నటించిన పీకే సినిమాను ఈ సంస్థే.. […]
Advertisement
బాహుబలి సినిమా ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు సృష్టించింది. పలు దేశాల్లో కూడా అఖండ విజయం సాధించింది. కేన్స్ చిత్రోత్సవంలో కూడా ఈ సినిమాకు భారీ ప్రచారం కల్పించారు. కొంతమంది ప్రముఖులకు ప్రత్యేకంగా ఈ సినిమాను చూపించారు. తాజాగా ఈ సినిమా చైనా మార్కెట్ ను టార్గెట్ చేసింది. త్వరలోనే చైనాలో బాహుబలిని విడుదల చేయబోతున్నారు. దీనికి సంబంధించి ఈ-స్టార్ అనే డిస్ట్రిబ్యూషన్ కంపెనీకి హక్కులు అమ్మేశారు. గతంలో అమీర్ నటించిన పీకే సినిమాను ఈ సంస్థే.. చైనాలో పంపిణీ చేసింది. చైనాలో పీకే మంచి విజయం సాధించింది. ఇప్పుడు బాహుబలిని కూడా అదే తరహాలో హిట్ చేయించాలనుకుంటున్నారు. దీని కోసం భారీగాప్రచారం కూడా మొదలుపెట్టారు. బాహుబలి టీంను ఇంటర్వ్యూ చేసేందుకు… చైనాలోని టాప్ మీడియా సంస్థల నుంచి జర్నలిస్టులు ఇండియాకు వచ్చారు. వాళ్లంతా రాజమౌళి, ప్రభాస్, రానా, తమన్న, అనుష్కలను ఇంటర్వ్యూ చేశారు. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రత్యేకంగా ఓ సెట్ లాంటిది రూపకల్పన చేశారు. స్టార్ హోటల్ లోనే ఇంటర్య్వూలు చేసినప్పటికీ.. బ్యాక్ గ్రౌండ్ లో బాహుబలి కాస్ట్యూమ్స్, లుక్ వచ్చేలా ఏర్పాట్లు చేశారు. త్వరలోనే చైనాలో అధికారికంగా ప్రమోషన్ ను స్టార్ట్ చేసి, సినిమాను విడుదల చేయబోతున్నారు. ఆఫ్రికా, ఉత్తర-దక్షిణ అమెరికా దేశాల్లో ఇప్పటికే మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా.. .చైనాలో ఏ రేంజ్ లో ఆడుతుందో చూడాలి.
Advertisement