అక్కడి భద్రత కూడా పరిటాల వర్గం చేతిలోనే!

 ఏపీ డీజీపీ నగరంలో ఉండగానే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులపై పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేయడం కలకలంరేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా భద్రతకరువవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఆస్పత్రిపై దాడి జరిగినప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తోందన్న దానిపై విమర్శలు వస్తున్నాయి. అయితే దాడిని అడ్డుకోకుండా సెక్యూరిటీ ఏజెన్సీ తమ సిబ్బందికి ఆదేశించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి భద్రతను జై బాలజీ […]

Advertisement
Update:2016-06-01 07:18 IST

ఏపీ డీజీపీ నగరంలో ఉండగానే అనంతపురం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైసీపీ నాయకులపై పరిటాల శ్రీరామ్ అనుచరులు దాడి చేయడం కలకలంరేపింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారికి కూడా భద్రతకరువవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలు ఆస్పత్రిపై దాడి జరిగినప్పుడు సెక్యూరిటీ ఏం చేస్తోందన్న దానిపై విమర్శలు వస్తున్నాయి. అయితే దాడిని అడ్డుకోకుండా సెక్యూరిటీ ఏజెన్సీ తమ సిబ్బందికి ఆదేశించిందని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రి భద్రతను జై బాలజీ అనే సెక్యూరిటీ ఏజెన్సీ నిర్వహిస్తోంది. మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీయే సిబ్బందిని నియమించారు. పరిటాల శ్రీరామ్ అనుచరుల దాడిలో గాయపడి చికిత్స పొందుతున్న వైసీపీనేతలను పరామర్శించేందుకు రాప్తాడు వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాశ్‌ రెడ్డి వస్తున్న విషయం తెలుసుకుని సెక్యూరిటీకి ముందే ఆదేశాలు వెళ్లాయంటున్నారు. అందుకే టీడీపీ కార్యకర్తలు ఆస్పత్రిలో వైసీపీ నేతలపై దాడికి ప్రయత్నించిన సమయంలో ఆస్పత్రి సెక్యూరిటీ స్పందించలేదంటున్నారు. రోగులు భయంతో పరుగులుతీస్తున్నా… ఆస్పత్రి పర్నిచర్ ధ్వంసం అవుతున్నా సెక్యూరిటీ సిబ్బంది స్పందించలేదంటున్నారు. పరిటాల సునీత సోదరుడు బాలాజీ ఆదేశాలతోనే సెక్యూరిటీ సిబ్బంది కళ్లుమూసుకున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వైసీపీ నేతలకు, పరిటాల వ్యతిరేకులకు ఆస్పత్రిలోనూ భద్రత లేకుండా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని అన్ని అవకాశాలను తమ గుప్పెట్లో పెట్టుకుని పరిటాల అనుచరులు చెలరేగిపోతున్నారని వైసీపీ నేతల ఆరోపణ.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News