చీకటి పడిన తర్వాత ఫుల్లుగా ఎంజాయ్ చేశారు...
ఒక్కొక్కరికి ఒక్కో లైఫ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లిష్టం. సాధారణ జనాలు కలలో కూడా ఊహించని కొన్ని కాంబినేషన్లు మనకు రియల్ లైఫ్ లో తారసపడుతుంటాయి. అలాంటి ఓ అరుదైన కాంబినేషన్ నే ముంబయిలో చూశాం. హీరోయిన్ శ్రద్ధాదాస్ కు, సినిమాల నుంచి తప్పుకున్న స్నేహా ఉల్లాల్ కు ఏమైనా సంబంధం ఉంటుందని చెప్పగలమా… అస్సలు ఊహించలేం. కానీ రియల్ లైఫ్ లో వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్. అంతేకాదు… చీకటి పడితే చాలు […]
ఒక్కొక్కరికి ఒక్కో లైఫ్ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఎవరి వ్యక్తిగత జీవితం వాళ్లిష్టం. సాధారణ జనాలు కలలో కూడా ఊహించని కొన్ని కాంబినేషన్లు మనకు రియల్ లైఫ్ లో తారసపడుతుంటాయి. అలాంటి ఓ అరుదైన కాంబినేషన్ నే ముంబయిలో చూశాం. హీరోయిన్ శ్రద్ధాదాస్ కు, సినిమాల నుంచి తప్పుకున్న స్నేహా ఉల్లాల్ కు ఏమైనా సంబంధం ఉంటుందని చెప్పగలమా… అస్సలు ఊహించలేం. కానీ రియల్ లైఫ్ లో వీళ్లిద్దరు మంచి ఫ్రెండ్స్. అంతేకాదు… చీకటి పడితే చాలు పబ్స్, పార్టీలు అంటూ ఫుల్లుగా ఎంజాయ్ చేశారు. రాత్రి వీకెండ్ పార్టీలో కూడా వీళ్లిద్దరు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. దానికి ఈ ఫొటోనే సాక్ష్యం. ఈ ఫొటోను స్వయంగా శ్రద్ధాదాస్ పోస్ట్ చేయడం మరో విశేషం. ప్రస్తుతం శ్రద్ధాదాస్ తెలుగు, హిందీ సినిమాలతో బిజీగా ఉంది. త్వరలోనే తమిళ్ ల ో కూడా పాగా వేయాలనుకుంటోంది. అటు స్నేహా ఉల్లాల్ మాత్రం నడుము నొప్పి కారణంగా పూర్తిగా సినిమాల నుంచి తప్పుతుంది. కష్టమైన పనులేవీ చేయొద్దని డాక్టర్లు సూచించడంతో కేవలం కూర్చోవడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తోంది. ఎక్సర్ సైజులు కూడా తేలికపాటివి మాత్రమే చేస్తోంది. తాజాగా లండన్ వెళ్లి వచ్చిన శ్రద్ధాదాస్, అక్కడి సంగతుల్ని తన ఫ్రెండ్ స్నేహా ఉల్లాల్ తో పంచుకుంది.