16ఏళ్లకే ప్రధాని పదవిపై లోకేష్ సలహా ఇచ్చాడు

నారాలోకేష్‌ను రాజకీయంగా పైకి లేపేందుకు చంద్రబాబు తవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన చెప్పే విషయాలు కొన్ని విచిత్రంగా ఉంటున్నాయి. తనకుమారుడి ప్రతిభను వివరించే ప్రయత్నంలో చంద్రబాబు మరోసారి అలాంటి ఆశ్చర్యకరమైన విషయమే చెప్పారు. మహానాడు సందర్భంగా శనివారం రాత్రి జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ గతంలో తాను ప్రధాని పదవి తీసుకోకపోవడానికి లోకేష్ సూచనే కారణమని  చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పినట్టు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు ప్రముఖంగా  ప్రచురించాయి. 1996లో జ్యోతిబసు, తాము […]

Advertisement
Update:2016-05-29 07:39 IST

నారాలోకేష్‌ను రాజకీయంగా పైకి లేపేందుకు చంద్రబాబు తవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. అయితే ఆ ప్రయత్నంలో ఆయన చెప్పే విషయాలు కొన్ని విచిత్రంగా ఉంటున్నాయి. తనకుమారుడి ప్రతిభను వివరించే ప్రయత్నంలో చంద్రబాబు మరోసారి అలాంటి ఆశ్చర్యకరమైన విషయమే చెప్పారు. మహానాడు సందర్భంగా శనివారం రాత్రి జర్నలిస్టులతో పిచ్చాపాటిగా మాట్లాడుతూ గతంలో తాను ప్రధాని పదవి తీసుకోకపోవడానికి లోకేష్ సూచనే కారణమని చెప్పారు. ఈ విషయాన్ని చంద్రబాబు చెప్పినట్టు ప్రముఖ ఆంగ్ల దిన పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి.

1996లో జ్యోతిబసు, తాము భాగస్వాములుగా ఉన్న థర్డ్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వచ్చినప్పుడు ప్రధాని పదవి చేపట్టాలని సంకీర్ణ నాయకులు తనను కోరారని చంద్రబాబు చెప్పారు. అయితే అది తాత్కాలిక పదవి అని లోకేష్ చెప్పడంతో ప్రధాని పోస్టును వదులుకున్నానని సీఎం వెల్లడించారు. అయితే చంద్రబాబు చెప్పిన మాటల్లో నిజముందా అన్న దానిపై అనుమానాలు వ్యక్త మవుతున్నాయి. ఎందుకంటే ప్రస్తుతం లోకేష్ వయసు 33 ఏళ్లు. బాబు చెబుతున్నట్టు తనకు ప్రధాని అయ్యే అవకాశం వచ్చినప్పుడు లోకేష్ పదో తరగతిలో ఉన్నారట. . అంటే అప్పుడు లోకేష్ వయసు 16ఏళ్లు. అంతచిన్న వయసులోనే లోకేష్ సలహా ఇచ్చారా?. దాన్నిపాటించి ప్రధాని పదవిని చంద్రబాబు వదులుకున్నారా?. 16ఏళ్లలోనే ప్రధాని పోస్టులో ఉండాలా వద్దా అన్నది లోకేష్ డిసైడ్ చేస్తే దాన్ని చంద్రబాబు పాటించారన్న మాట. అంటే లోకేష్ బాలమేధావే.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News