మనది మహా..భారతమే...ఇంకా ద్రౌపదులున్నారు!
కాన్పూర్‌లో ఒక ప్రబుద్ధుడు ఐపిఎల్ క్రెకెట్ మ్యాచ్ బెట్టింగ్‌లో తన భార్యమీదే పందెం కాశాడు. ఓడిపోయాడు కూడా. దాంతో అతనిమీద గెలిచినవారు ఆమెకోసం వారింటి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఫోన్‌చేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ బాధలను భరించలేకపోయిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఆమె భర్తకు, ఆమెని వేధించినవారికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు. ఆ భార్యాభర్తలకు ఐదేళ్లక్రితం పెళ్లయింది. భర్త షేర్స్ […]
కాన్పూర్‌లో ఒక ప్రబుద్ధుడు ఐపిఎల్ క్రెకెట్ మ్యాచ్ బెట్టింగ్‌లో తన భార్యమీదే పందెం కాశాడు. ఓడిపోయాడు కూడా. దాంతో అతనిమీద గెలిచినవారు ఆమెకోసం వారింటి చుట్టూ తిరగటం మొదలుపెట్టారు. ఫోన్‌చేసి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఆ బాధలను భరించలేకపోయిన ఆమె చివరికి పోలీసులను ఆశ్రయించింది. ఆమె పిర్యాదు విని పోలీసులే ఆశ్చర్యంతో తెల్లబోయారు. ఆమె భర్తకు, ఆమెని వేధించినవారికి వ్యతిరేకంగా ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నిందితులు పరారీలో ఉన్నారు.
ఆ భార్యాభర్తలకు ఐదేళ్లక్రితం పెళ్లయింది. భర్త షేర్స్ బిజినెస్ చేస్తుండగా భార్య బొటిక్ నడుపుతోంది. అయితే పెళ్లయిన నాటినుండి వారిమధ్య సఖ్యత లేదు. పెళ్లయిన మొదటిరోజునే భర్త, భార్యని ఆమె నగలన్నింటినీ తీసి తనకు ఇవ్వాల్సిందిగా కోరాడు. అతనికి తాగుడు, జూదం తదితర అలవాట్లున్నాయని ఆమెకు తరువాత తెలిసింది. అతను జూదం, బెట్టింగ్‌ల్లో ఇంట్లోని విలువైన వస్తువులన్నింటినీ పోగొట్టేశాడు. తండ్రిని అడిగి ఏడులక్షలు తీసుకురమ్మని భార్యని కొడుతుండేవాడు. చివరికి ఐపిఎల్ బెట్టింగ్‌లో భార్యపై పందెం కాసి కోల్పోయాడు.