రాయుడు సినిమా రివ్యూ

టైటిల్ :  రాయుడు రేటింగ్: 2.75 తారాగణం :  విశాల్, శ్రీదివ్య తదితరులు సంగీతం : డి.ఇమ్మాన్ దర్శకత్వం : యమ్. ముత్తయ్య నిర్మాత :  విశాల్ విశాల్‌ మంచినటుడు. అవన్‌ ఇవన్‌ సినిమాలో మెల్లకంటివాడుగా నటించి విశ్వరూపం చూపించాడు. తెలుగులో వచ్చిన పందెంకోడి హిట్‌ కావడంతో ఇక్కడ కూడా మార్కెట్‌ పెరిగింది. అందుకే రాయుడు సినిమాకి థియేటర్ల వద్ద సందడి కనిపించింది.  ఒక చిన్నవూరు. అక్కడో విలన్‌. హీరోకి అతనికి గొడవలు మొదలై చివరికి విలన్‌ని హీరో చంపడంతో సినిమా […]

Advertisement
Update:2016-05-27 10:32 IST

టైటిల్ : రాయుడు
రేటింగ్: 2.75
తారాగణం : విశాల్, శ్రీదివ్య తదితరులు
సంగీతం : డి.ఇమ్మాన్
దర్శకత్వం : యమ్. ముత్తయ్య
నిర్మాత : విశాల్

విశాల్‌ మంచినటుడు. అవన్‌ ఇవన్‌ సినిమాలో మెల్లకంటివాడుగా నటించి విశ్వరూపం చూపించాడు. తెలుగులో వచ్చిన పందెంకోడి హిట్‌ కావడంతో ఇక్కడ కూడా మార్కెట్‌ పెరిగింది. అందుకే రాయుడు సినిమాకి థియేటర్ల వద్ద సందడి కనిపించింది.

ఒక చిన్నవూరు. అక్కడో విలన్‌. హీరోకి అతనికి గొడవలు మొదలై చివరికి విలన్‌ని హీరో చంపడంతో సినిమా అయిపోతుంది. ఇలాంటివి కొన్ని వందల సినిమాలు వచ్చుంటాయి. హీరోలకి ఇలాంటి కథలు ఎట్లా నచ్చుతాయో తెలియదు. అదో మిలియన్‌ డాలర్ల ప్రశ్న. కథ చెప్పేటపుడు అద్భుతంగా చెప్పి తీసేటపుడు పేలవంగా తీస్తారేమో తెలియదు. ఈ తలనొప్పి కథల్ని డబ్బింగ్‌ చేసి ఇతర రాష్ట్రాల జనం పైకి కూడా తోలుతున్నారు.

హీరో విశాల్‌ హమాలి. మూటలు మోస్తూ వుంటాడు (ఈ విషయంలో తమిళ హీరోల్ని మెచ్చుకోవాలి. క్యారెక్టర్‌ నచ్చితే బిచ్చగాడి పాత్రయినా వేస్తారు. మన వాళ్ళయితే కిందకు దిగనేదిగరు). అమ్మమ్మమాట జవాదటడు. ఆ వూళ్ళో బైరవడు అనే ఒకలీడర్‌ ఆయనకో అనుచరుడు. వాడికో బావ. వాళ్ళిద్దరి మధ్య గొడవ. వీళ్ళ నడుమ ఒక లాయర్‌.ఆయన కూతరు హీరోయిన్‌ (శ్రీదివ్య).

హీరో ఒక రోజు హీరోయిన్‌ని చూస్తాడు. ఆ అమ్మాయితో విశాల్‌కి పెళ్ళి చేయాలని అమ్మమ్మ కంకణం కట్టుకుంటుంది. వాళ్ళ మధ్య లవ్‌ ఎస్టాబ్లిష్‌ అవడానికి ఫస్టాఫ్‌ సరిపోతుంది. ఇంటర్వెల్‌ సమయానికి ఒక నిజం తెలుస్తుంది. హీరోయిన్‌ తల్లిని విలన్‌ మనుషులు చంపేసి వుంటారు. చనిపోడానికి ముందు ఆమె విశాల్‌ సాయంకోరి వస్తే ఆ గొడవల్లోకి తన మనుమడిని లాగొద్దని అమ్మమ్మ చెప్పి పంపేస్తుంది. తరువాత హీరోయిన్‌ తల్లి హత్య జరుగుతుంది. తాను చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంకోసం ముసలమ్మ తన మనుమడికి హీరోయిన్‌కి పెళ్ళి జరిగేలా చూస్తుంది.

సెకెండాఫ్‌ కూడా ఈ ముసలమ్మ గోలే. హీరో మీద పగతీర్చుకోవడం మానేసి అనవసరంగా ముసలమ్మని హింసించి విలన్‌ చంపుతాడు. దాంతో రెచ్చిపోయిన హీరో అందరిని చీల్చి చెండాడుతాడు.

తమిళ బోర్డులు, పోస్టర్లు కనబడకుండా తెలుగు పేర్లు కనిపించేలా సినిమాలో జాగ్రత్తలు తీసుకోవడం బాగుంది. కానీ అనంతపురంలో జరుగుతున్న కథలో ఒక్కో పాత్ర ఒక్కో యాసలో మాట్లాడుతుంది. నెల్లురు జిల్లాలో ఉన్న దొరవారి సత్రాన్ని అనంతపురం ప్రక్కన చూపించడం ఇంకో విశేషం. డబ్బింగ్ సినిమాలో ఇవ్వన్నీ పట్టించుకోకూడదు కానీ కొంచెం జాగ్రత్త తీసుకుంటే బాగుండేది, సినిమాలో రెండు పాటలు బాగున్నాయి.

ఫైట్స్ బాగున్నాయి. విశాల్ అభిమానులకు నచ్చుతుంది. తమిళ డబ్బింగ్ సినిమాల్లో తెలుగు నేటివిటీ తీసుక రావడం కష్టం. సినిమాలో ప్రధాన లోపం ఏమంటే పాత్రలకి ఒక లక్ష్యం లేకపోవడం సంఘర్షణ లేకపోవడం. కథల కొరత అన్ని భాషలను పట్టిపీడిస్తుంది. పాత కథలకు కొత్త రంగు వేసి గ్రాఫిక్స్, టేకింగ్ అని మాయ చేయాలని చూస్తున్నారు. జనం తిప్పి కొడుతున్నారు. మరి ప్రేక్షకులు ఈ సినిమాని తిప్పికొడతారో, ఆదరిస్తారో చూడాలి.

-జీ ఆర్.మహర్షి

Tags:    
Advertisement

Similar News