మోత్కుపల్లి కిం కర్తవ్యం?
పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీని నమ్ముకున్న తెలంగాణ నేతల ఆశలకు చినబాబులోకేశ్ గండికొట్టాడు. తెలంగాణ నేతలకు రాజ్యసభ టికెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో తమకు కనీసం ఏపీ నుంచైనా రాజ్యసభ టికెట్ దక్కుతుందని చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న తెలుగు తమ్ముళ్లు ఈ వ్యాఖ్యలతో విలవిల్లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగూ ఎన్నికల్లో గెలవలేదు. ఈ ప్రాంతంలో ఉన్న నేతలకు పార్టీ కనీసం నామినేటెడ్ పదవులను సైతం కట్టబెట్టలేదు. తెలంగాణ నుంచి పార్టీ తమకు ఏదో […]
Advertisement
పార్టీ ఆవిర్బావం నుంచి పార్టీని నమ్ముకున్న తెలంగాణ నేతల ఆశలకు చినబాబులోకేశ్ గండికొట్టాడు. తెలంగాణ నేతలకు రాజ్యసభ టికెట్ ఇచ్చేది లేదని కుండబద్దలు కొట్టాడు. దీంతో తమకు కనీసం ఏపీ నుంచైనా రాజ్యసభ టికెట్ దక్కుతుందని చకోర పక్షుల్లా ఎదురుచూస్తోన్న తెలుగు తమ్ముళ్లు ఈ వ్యాఖ్యలతో విలవిల్లాడుతున్నారు. 2014 ఎన్నికల్లో తెలంగాణలో ఎలాగూ ఎన్నికల్లో గెలవలేదు. ఈ ప్రాంతంలో ఉన్న నేతలకు పార్టీ కనీసం నామినేటెడ్ పదవులను సైతం కట్టబెట్టలేదు. తెలంగాణ నుంచి పార్టీ తమకు ఏదో చేస్తుందన్న బలమైన నమ్మకంతో చాలా మంది నేతలు ఎంతోకాలంగా పార్టీపై ఆధారపడి ఉన్నారు. వీరిలో మోత్కుపల్లి నరసింహులు ముందుంటారు. దళితనేతగా, కేసీఆర్ వ్యతిరేకిగా తెలంగాణలో బాగా పాపులర్ అయ్యారు. ఎన్టీఆర్ మంత్రి వర్గంలో మంత్రిగా పనిచేశారు కూడా. అలాంటి మోత్కుపల్లి ఉద్యమ సమయంలో కేసీఆర్‌ను తీవ్ర పదజాలంతో విమర్శించే వారు. పార్టీ అధినేత చంద్రబాబు ఆయనకు గవర్నర్ లేదా రాజ్యసభ సీటు ఇస్తానని ఆశచూపారని అప్పట్లో ప్రచారం జరిగింది.
పార్టీ కోసం.. తన భవిష్యత్తును తాకట్టు పెట్టారు..
పార్టీ కోసం ఆయన తన రాజకీయ భవిష్యత్తును తాకట్టు పెట్టారని చెప్పవచ్చు. తెలంగాణ ఉద్యమానికి చిరునామాగా ఉన్న కేసీఆర్‌ను విమర్శించి ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయారు. వాస్తవానికి అప్పటికే తెలుగుదేశానికి అప్పటికే తెలంగాణ వ్యతిరేక పార్టీగా ముద్రపడింది. ఆయన అప్పటికప్పుడు కాంగ్రెస్, టీఆర్ ఎస్‌లో దేంట్లో చేరినా విజయం సాధించేవారు. కేవలం టీడీపీ వ్యతిరేక ఓట్లతో ఓడారేగానీ, ఆయన వ్యక్తిగతంగా ప్రజలకు ఇప్పటికీ దగ్గరగా ఉండే నాయకుడే. ఆ ఓటమి తరువాత పార్టీ అధినేత ఆదుకుంటారని ప్రచారం జరిగింది. కానీ, ఇప్పుడు పరిస్థితి పూర్తిగా తలకిందులు అయింది. తాజాగా చినబాబుచేసిన వ్యాఖ్యలతో ఆయనకు తన రాజకీయ భవిష్యత్తుపై ఫుల్ క్లారిటీ వచ్చిందనే చెప్పాలి. ఏదీ మనసులో దాచుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు ముఖంమీదే మాట్లాడటం ఆయన స్టైల్. పత్యర్థులను విమర్శించడంలో ఆయన ఫైర్‌బ్రాండ్‌గా పేరొందారు. మాదిగ సామాజిక వర్గంలో బలమైన నేతగా గుర్తింపు పొందారు. ఆయన స్టయిల్ నచ్చిడంతో ఓ సినిమాలో మంత్రి పాత్ర కూడా వేయించుకున్నాడు ఓ దర్శకుడు. ముక్కుసూటిగా తన నిర్ణయాలను ప్రకటించే మోత్కుపల్లి అధిష్టానంతో తాడోపేడో తేల్చుకుంటాడా? లేదా ఇంకా వేచి చూసే ధోరణినే నమ్ముకుంటాడా? అన్నది ఆసక్తికరంగా మారింది.
Advertisement