ఎక్స్-బాయ్‌ఫ్రెండ్స్‌తో రొమాన్స్ కు కత్రీనా రెడీ

ఒక్కసారి విడిపోయాక, ఆ రిలేషన్‌షిప్ నుండి దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు సినిమా కపుల్స్. లవ్ అఫెయిర్ నడిపినంత కాలం.. కలసి తిరగడం, కలిసి సినిమాలు చేయడం రివాజే. కాని విడిపోయిన బాయ్‌ఫ్రెండ్స్‌తో సినిమాల మీద సినిమాలు చేస్తూ సినిమా రొమాన్స్ కంటిన్యూ చేస్తున్నదీ బాలివుడ్ భామ కత్రినా కైఫ్. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో విడిపోయాక కూడా సూపర్‌హిట్ సినిమాలు చాలా చేసింది కత్రినా. ఇప్పటికీ సల్మాన్ ఖాన్‌ని కలుస్తుండడం, అతని ఫ్యామిలీతో సఖ్యమైన సంబంధాలు […]

Advertisement
Update:2016-05-24 05:34 IST

ఒక్కసారి విడిపోయాక, ఆ రిలేషన్‌షిప్ నుండి దూరంగా ఉండడానికే ట్రై చేస్తారు సినిమా కపుల్స్. లవ్ అఫెయిర్ నడిపినంత కాలం.. కలసి తిరగడం, కలిసి సినిమాలు చేయడం రివాజే. కాని విడిపోయిన బాయ్‌ఫ్రెండ్స్‌తో సినిమాల మీద సినిమాలు చేస్తూ సినిమా రొమాన్స్ కంటిన్యూ చేస్తున్నదీ బాలివుడ్ భామ కత్రినా కైఫ్. కండల వీరుడు సల్మాన్ ఖాన్‌తో విడిపోయాక కూడా సూపర్‌హిట్ సినిమాలు చాలా చేసింది కత్రినా. ఇప్పటికీ సల్మాన్ ఖాన్‌ని కలుస్తుండడం, అతని ఫ్యామిలీతో సఖ్యమైన సంబంధాలు మెయింటెయిన్ చెయ్యడం కత్రినాకే చెల్లింది.

ఇక ఇటీవల విడిపోయిన మరో బాయ్‌ఫ్రెండ్ రణ్‌బీర్ కపూర్‌తో కూడా సినిమా చేస్తూ బిజీగా ఉంది కత్రినా. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జగ్గా జాసూస్’ అనే సినిమా విడుదలకు కూడా సిద్ధం అవుతోందట. పెళ్ళి వరకు వెళ్ళి కూడా.. రణ్‌బీర్‌తో అఫెయిర్ ఫైల్ అయినా.. ఆ ఛాయలేమీ కనిపించనీయకుండా కెరీర్ నెట్టుకొస్తిందీ పొడుగుకాళ్ళ సుందరి. ఇప్పుడు మళ్ళీ సల్మాన్‌తో జత కట్టబోతున్నదట. ఈ సినిమాను సల్మాన్ సిస్టర్ అల్వీరా ప్రొడ్యూస్ చేస్తోంది. కత్రినా అల్వీరా క్లోజ్ ఫ్రెండ్స్. అంతే కాక సల్మాన్ కత్రినా ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ..వారు విడిపోయాక కూడా సూపర్‌హిట్ కాంబినేషన్ అని ప్రూవ్ అయ్యింది. మరింకేం? మరోసారి ఎక్స్-బాయ్‌ఫ్రెండ్‌తో సినిమా రొమాన్స్‌కి కత్రినా రెడీ ఇక.

Tags:    
Advertisement

Similar News