మరో గెస్ట్ రోల్ కు ఒప్పుకున్న బన్నీ
ఇప్పటివరకు దర్శకులు రిక్వెస్ట్ చేస్తేనే గెస్ట్ రోల్స్ చేశాడు. పైగా ఆ పాత్రలు తనకు నచ్చాయి కాబట్టి చేశాడు. కానీ తొలిసారి బన్నీ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానంటూ బతిమలాడి మరీ చేస్తున్నాడు. ఆ సినిమానే చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు. ఈ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశముందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా ఆ వార్తలన్నీ నిజమేనని తేలిపోయాయి. మెగాస్టార్ 150వ సినిమాలో బన్నీ ఉంటాడని దర్శకుడు వీవీ […]
Advertisement
ఇప్పటివరకు దర్శకులు రిక్వెస్ట్ చేస్తేనే గెస్ట్ రోల్స్ చేశాడు. పైగా ఆ పాత్రలు తనకు నచ్చాయి కాబట్టి చేశాడు. కానీ తొలిసారి బన్నీ ఓ సినిమాలో గెస్ట్ రోల్ చేస్తానంటూ బతిమలాడి మరీ చేస్తున్నాడు. ఆ సినిమానే చిరంజీవి 150వ మూవీ కత్తిలాంటోడు. ఈ సినిమాలో బన్నీ గెస్ట్ రోల్ లో కనిపించే అవకాశముందని ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. ఫైనల్ గా ఆ వార్తలన్నీ నిజమేనని తేలిపోయాయి. మెగాస్టార్ 150వ సినిమాలో బన్నీ ఉంటాడని దర్శకుడు వీవీ వినాయక్ స్పష్టంచేశాడు. అంతేకాదు.. కథలో బన్నీ కోసం ఓ మంచి పాత్ర కూడా సిద్ధంచేశామని అంటున్నాడు. బన్నీకి గెస్ట్ రోల్స్ చేయడం కొత్తేంకాదు. రుద్రమదేవి సినిమాలో గోన గన్నారెడ్డిగా మెప్పించాడు. అంతకంటే ముందు ఎవడు సినిమాలో కీలకమైన పాత్ర పోషించాడు. దానికంటే ముందు వేదం సినిమాలో అంతకంటే కీలకమైన పాత్ర పోషించాడు. ఈ పాత్రలన్నీ తనకు నచ్చి చేసినవే. పైగా దర్శకుల కోరిక మేరకు చేసినవి. కానీ ప్రతిష్టాత్మక 150వ సినిమాలో మాత్రం ఏరికోరి చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
Advertisement