సరబ్ జిత్. రివ్యూ
యాంకర్ తను చేయని నేరానికి ఒక మనిషి ప్రాణం పోతే ఎలా అనిపిస్తుంది అలాగే ఒక దేశం మీద కోపంతో .. బోర్డర్ ఏరియాలో ఒక రైతు ను పట్టుకుని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించి.. తీవ్రవాది అని ముద్ర వేసి.. చివరకు హత్య చేసిన దేశాన్ని ఏమనాలి..? అమాయకుడైన తన అన్నయ్యను రక్షించుకోవాడానికి తన జీవితానే త్యాగం చేసిన చెల్లి గురించి ఎంత చెప్పాలి..? ఇటువంటి ఎన్నో విషయాల్ని చూపించడానికి అస్కారం ఉన్నవాస్తవ చిత్ర […]
యాంకర్ తను చేయని నేరానికి ఒక మనిషి ప్రాణం పోతే ఎలా అనిపిస్తుంది అలాగే ఒక దేశం మీద కోపంతో .. బోర్డర్ ఏరియాలో ఒక రైతు ను పట్టుకుని 20 ఏళ్లు చీకటి గదిలో బంధించి.. తీవ్రవాది అని ముద్ర వేసి.. చివరకు హత్య చేసిన దేశాన్ని ఏమనాలి..? అమాయకుడైన తన అన్నయ్యను రక్షించుకోవాడానికి తన జీవితానే త్యాగం చేసిన చెల్లి గురించి ఎంత చెప్పాలి..? ఇటువంటి ఎన్నో విషయాల్ని చూపించడానికి అస్కారం ఉన్నవాస్తవ చిత్ర కథే సరబ్ జిత్. మరి మేరికోమ్ చిత్రంతో మెప్పించిన దర్శకుడు ఒమాంగ్ కుమార్ సరబ్ జిత్ ను ఎలా చేశాడో ఈ చిత్ర రివ్యూలో చూద్దాం…
రేటింగ్. 3.5/5
దర్శకుడు . ఒమాంగ్ కుమార్
నటీ నటులు. రణదీప్ హూడా. ఐశ్వర్యరాయ్
జానర్. బయో పిక్
నిడివి. రెండు గంటల 11 నిముషాలు
బాలీవుడ్ లో భాగ్ మిల్కా భాగ్ చిత్రం విడుదల తరువాత ఆటో బయోగ్రఫిలకు .. రియల్ స్టోరీస్ కు బూస్టింగ్ ఇచ్చింది. ఆ తరువాత మేరి కోమ్ జీవిత కథా ఆధారంగా ”మేరికోమ్” గా చిత్రం వచ్చింది. అదే రీతిలో ప్రస్తుతం మన టీమ్ ఇండియా మాజి క్రికేటర్స్ అజారుద్దీన్ , సచిన్ లతో పాటు. ప్రస్తుతం టీమ్ ఇండియా కేప్టన్ ధోని ఆటో బయో గ్రఫీలు కూడా సినిమాలుగా వస్తున్నాయి. అయితే తాజాగా మేరికోమ్ చిత్రం చేసిన దర్శకుడు సరబ్ జిత్ చిత్రాని తెరకెక్కించారు. పంజాబ్ లో ఎక్కడో వ్యవసాయం చేసుకంటూ.. భార్య పిల్లలతో కలసి హాయగా జీవనం సాగించే సరబ్ జిత్ .. ఒక రోజు కొంచెం ఆల్కాహాల్ తీసుకుని లార్డ్ శివ కీర్తనలు పాడుకుంటూ ఇండో పాక్ట్ బోర్డర్ లో సంచరించడమే ఆయన పాలిట శాపంగా మారింది. పాకిస్తాన్ ఆర్మి ఈ వ్యవసాయ దారుణి మాటేసి పట్టుకుని.. భారత్ నుంచి పాకిస్తాన్ ను నాశనం చేయడానికి వచ్చిన తీవ్రవాదిగా ముద్ర వేసి పాకిస్తాన్ జెల్లో బంధించారు. ఒకటి రెండు సంవత్సరాలు కాదు.. దాదాపు 20 సంవత్సరాలు సరబ్ జిత్ ను జైల్లో బంధించారు. అయితే ఒక సాధారణ ఖైదిగా ట్రీమ్ మెంట్ చేసి వుంటే సినిమా గా చేయాల్సినంత కంటెంట్ ఏమి లేదు.
కాని సరబ్ జిత్ ను ఒక చీకటి గదిలో బంధించి.. సరిగా తిండి , వేలుగు లేని రూమ్ లో ఖైదు చేశారు. ఎంతో బలియంగా వుండే సరబ్ జీత్ ను ఒక మనిషిగా ట్రీట్ చేయలేదు. ఒక కీటకం కంటే ఘోరంగా ట్రీట్ చేశారు. దాదాపు 12 ఏ ళ్ల పాటు వెలుగు చూడనియకండా ఖైదు చేశారు. ఈ దశలో తన సోదరుణి విడిపించడానికి సరబ్ జిత్ సోదరి దల్చీర్ చేసిన పోరాటమే ఈ చిత్రం. దల్బీర్ గా ఐశ్వర్య రాయ్ ప్రాణం పోసింది. సరబ్ జిత్ గా రణదీప్ హుడా జీవించాడు. దర్శకుడు ఒమాంగ్ కుమార్ .. సరబ్ జిత్ లో ట్రాజడిని భావోద్వేగాలతో ఆడియన్స్ కు చేరవేయడంలో సక్సెస్ అయ్యాడు.
తన సోదరుడు తీవ్రవాది కాదని.. తనను విడుదల చేయాలని సరబ్ జిత్ సోదరి దల్బీర్ పాకిస్తాన్ లో చేసిన పోరాటాలు అక్కడ మహిళలను సైతం కదలించడం .. చివరకు తన పోరాటం సరబ్ జిత్ ను ఏ తీరానికి తీర్చింది. అనేది ఈ చిత్రం పాయింట్. వాణిజ్య అంశాలు ఏమి లేకుండా.. కథను నటీ నటులు రక్తి కట్టించారు. చేయని నేరానికి పరదేశంలో ఖైదిగా ప్రాణాల్ని పోగొట్టుకున్న సరబ్ జిత్ జీవిత కథ లో ఎంతో ట్రాజెడి ఉంది. సోదరుడిని కాపాడుకోవాలని చెల్లి చేసిన పోరాటంలో ఏంతో ఆవేదన, త్యాగం, పోరాట స్పూర్తి.. రక్త సంబంధం గొప్పతనం.. ఇలా ఎన్నో హ్యమన్ ఎమోషన్స్ తో పాటు.. రెండు దేశాల మధ్య శత్రుత్వ ధోరణి తో అమాయకులు ఎలా బలి అవుతున్నారనే వాస్తవ చిత్రం ఉంది.
సరబ్ జిత్ ఒక చిత్రం కాదు. ఒక జీవితం. ఒక దేశపు మూర్ఖత్వానికి నిలువెత్తు దర్పణం. ఇలా సరబ్ జిత్ చిత్రం ఎన్నో విషయాల్ని ఆవిష్కరించింది. సినిమా ప్రేక్షకుడు ప్రతి ఒక్కరు చూసి తీర వలసిన చిత్రం ఇది. నటీ నటుల యాక్టింగ్ గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు ఒమాంగ్ కుమార్ ఆటోబయో గ్రపిలు డైరెక్ట్ చేయడంలో మరోసారి తన ప్రతిభను చాటుకున్నాడు. ఓవరాల్ గా సరబ్ జిత్ ఒక సినిమా కాదు. అంతకంటే ఎక్కవ అని చెప్పాల్సిందే మరి. ఈ సినిమాకు సంబంధించి సాంకేతిక విభాగాల పనితీరు సగం సక్సెస్ అనే చెప్పాలి .