పొగిడేసుకున్నారు " బాబును ఆకాశానికెత్తిన పొత్తూరి, రామోజీపై బాబు ప్రశంసలు

అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి భవనాలు ఉండాలన్నారు. సంస్కృతి మాత్రం మనదే ప్రతిబింబించాలన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్కిటెక్‌ల‌తో డిజైన్లు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి ప్ర‌భువు రాజా వెంక‌టాద్రినాయుడు అంటూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పొత్తూరు వెంక‌టేశ్వ‌ర‌రావు ఒక పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని విజయవాడ శేషసాయి కల్యాణమండలంలో సీఎం చంద్ర‌బాబునాయుడు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు త‌దిత‌రులు ఆవిష్క‌రించారు. ఈసంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పొత్తూరు వెంక‌టేశ్వ‌ర‌రావు .. చంద్ర‌బాబును […]

Advertisement
Update:2016-05-20 13:03 IST

అమరావతి తెలుగు ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అన్నారు. అమరావతిలో అంతర్జాతీయ స్థాయి భవనాలు ఉండాలన్నారు. సంస్కృతి మాత్రం మనదే ప్రతిబింబించాలన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ ఆర్కిటెక్‌ల‌తో డిజైన్లు రూపొందిస్తున్నామ‌ని చెప్పారు. అమ‌రావ‌తి ప్ర‌భువు రాజా వెంక‌టాద్రినాయుడు అంటూ సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పొత్తూరు వెంక‌టేశ్వ‌ర‌రావు ఒక పుస్త‌కాన్ని ర‌చించారు. ఈ పుస్త‌కాన్ని విజయవాడ శేషసాయి కల్యాణమండలంలో సీఎం చంద్ర‌బాబునాయుడు, స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద్‌రావు త‌దిత‌రులు ఆవిష్క‌రించారు.

ఈసంద‌ర్భంగా సీనియ‌ర్ జ‌ర్న‌లిస్ట్ పొత్తూరు వెంక‌టేశ్వ‌ర‌రావు .. చంద్ర‌బాబును ఆకాశానికెత్తేశారు. అమ‌రావ‌తికి ఎన్న‌డూ లేనంత వైభవం తెచ్చేందుకు సిద్ధ‌మైన చంద్ర‌బాబుకు తాను ఏమివ్వ‌గ‌ల‌ను అన్నారు. అమ‌రావ‌తి పూర్వ‌వైభవం చంద్ర‌బాబుతోనే సాధ్య‌మ‌న్నారు. చంద్రుడికి నూలుపోగు అన్న‌ట్టు తాను ర‌చించిన పుస్త‌కాన్ని చంద్ర‌బాబుకు అంకిత‌మిస్తున్న‌ట్టు చెప్పారు. నాటి ఇంద్రుడి నుంచి నేటి చంద్రుడి వ‌ర‌కు అమ‌రావ‌తికి అద్బుత‌మైన చ‌రిత్ర ఉంద‌న్నారు సీనియ‌ర్ జ‌ర్నలిస్ట్ పొత్తూరి.

ఈ సంద‌ర్భంగా మాట్లాడిన చంద్ర‌బాబు … అమ‌రావ‌తిని పాలించిన వెంకటాద్రి నాయుడు గురించి పుస్తకం తీసుకురావటం అభినందనీయమని అన్నారు. గతంలో అమరావతి ఎక్కడుందో కూడా ఎవరికీ తెలిసేది కాదని.. రాష్ట్ర విభజన తర్వాత అమరావతి గురించి చర్చ మొదలైందన్నారు. అమ‌రావ‌తికి చెందిన వార‌స‌త్వ సంప‌దను లండ‌న్, చెన్నై, హైద‌రాబాద్‌లోని మ్యూజియంల నుంచి వెన‌క్కు తెస్తామ‌న్నారు. అమ‌రావ‌తి పేరును సూచించింద‌ని రామోజీరావేన‌ని చంద్ర‌బాబు చెప్పారు. అమ‌రావ‌తి చ‌రిత్ర గురించి త‌న‌కు పూర్తి వివ‌రాలు పంపించి రామోజీ ఎంతో కృషి చేశార‌న్నారు.

స్పీక‌ర్ కోడెల శివ‌ప్ర‌సాద‌రావు కూడా చంద్ర‌బాబును పొగిడేశారు. వెంక‌టాద్రినాయుడి చ‌రిత్ర అంద‌రూ తెలుసుకోవాల‌న్నారు. వెంక‌ట్రాదినాయుడు త‌ర‌హాలోనే చంద్ర‌బాబునాయుడు ఇప్పుడు అమ‌రావతి కోసం వ‌చ్చార‌న్నారు. అమ‌రావ‌తి స్వ‌రూపాన్ని రెండేళ్ల‌లో చంద్ర‌బాబు మార్చేస్తార‌ని కోడెల ధీమా వ్య‌క్తం చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News