పార్థ‌సార‌ధి, కొడాలి నానికి కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గింత‌

మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత పార్థసార‌థికి వైఎస్ జగ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా పార్థసార‌ధిని నియ‌మించారు. ఈమేర‌కు వైసీపీ నాయ‌క‌త్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్థ‌సార‌ధి కాంగ్రెస్‌లో మంత్రిగా చేశారు. 2014 ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరారు. అప్ప‌టి నుంచి పార్టీలో చురుగ్గా ప‌నిచేస్తున్నారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొడాలి నానిని నియ‌మించారు. కొడాలి ప్ర‌స్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర వైసీపీ యూత్ విభాగం అధ్య‌క్షుడిగా ఉన్న […]

Advertisement
Update:2016-05-18 07:43 IST

మాజీ మంత్రి, సీనియ‌ర్ నేత పార్థసార‌థికి వైఎస్ జగ‌న్ కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్య‌క్షుడిగా పార్థసార‌ధిని నియ‌మించారు. ఈమేర‌కు వైసీపీ నాయ‌క‌త్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. పార్థ‌సార‌ధి కాంగ్రెస్‌లో మంత్రిగా చేశారు. 2014 ఎన్నిక‌ల ముందు వైసీపీలో చేరారు. అప్ప‌టి నుంచి పార్టీలో చురుగ్గా ప‌నిచేస్తున్నారు. అలాగే వైసీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా కొడాలి నానిని నియ‌మించారు. కొడాలి ప్ర‌స్తుతం గుడివాడ ఎమ్మెల్యేగా ఉన్నారు. రాష్ట్ర వైసీపీ యూత్ విభాగం అధ్య‌క్షుడిగా ఉన్న వంగ‌వీటి రాధాను విజ‌య‌వాడ న‌గ‌ర అధ్యక్షుడిగా నియ‌మించిన మ‌రుస‌టి రోజే జ‌గ‌న్‌… పార్థ‌సార‌థి, కొడాలి నానికి అద‌న‌పు బాధ్య‌త‌లు అప్ప‌గించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News