తమిళనాడులో పట్టుబడ్డ రూ. 570 కోట్లు చంద్రబాబువే " బొత్స

కొయంబత్తూరు నుంచి విశాఖకు తరలిస్తున్న రూ. 570 కోట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. డబ్బు తరలిస్తూ పట్టుబడిన వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనేక అనుమానులు వ్యక్తమవుతున్నాయి. డబ్బు బ్యాంకుదని పట్టుబడిన వారు చెప్పినా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. అయితే సొమ్ముపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ డబ్బు ముమ్మాటికి చంద్రబాబు, ఆయన బినామీలదేనని అన్నారు. విశాఖను కబలించడానికి, అక్రమ రియల్ ఎస్టేట్ దందా […]

Advertisement
Update:2016-05-14 11:31 IST

కొయంబత్తూరు నుంచి విశాఖకు తరలిస్తున్న రూ. 570 కోట్లు బయటపడడం సంచలనం సృష్టిస్తోంది. డబ్బు తరలిస్తూ పట్టుబడిన వారు పొంతన లేని సమాధానాలు చెబుతుండడంతో అనేక అనుమానులు వ్యక్తమవుతున్నాయి. డబ్బు బ్యాంకుదని పట్టుబడిన వారు చెప్పినా అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు లేకపోవడంతో డబ్బును సీజ్ చేశారు. అయితే సొమ్ముపై వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అనుమానం వ్యక్తం చేశారు. ఈ డబ్బు ముమ్మాటికి చంద్రబాబు, ఆయన బినామీలదేనని అన్నారు. విశాఖను కబలించడానికి, అక్రమ రియల్ ఎస్టేట్ దందా నిర్వహించేందుకు ఈ అవినీతి సొమ్ము తరలిస్తున్నారని ఆరోపించారు.

బ్యాంకు సొమ్ము అయితే అందుకు సంబంధింన వివరాలు బయటకు వచ్చేవన్నారు. రాష్ట్రం క్లిష్ట పరిస్థితిలో ఉన్న సమయంలోనే చంద్రబాబు రహస్యంగా విదేశాల్లో ఎందుకు పర్యటిస్తున్నారని బొత్స ప్రశ్నించారు. విదేశాల నుంచి తరలించిన సొమ్మే తమిళనాడులో పట్టుబడి ఉంటుందన్నారు. పనామా జాబితాలో పేర్లు రాగానే విదేశాలకు వెళ్లడం పలు అనుమానాలకు తావిస్తోందన్నారు. అవినీతి సొమ్మును చక్కబెట్టుకునేందుకు చంద్రబాబు విదేశాలకు వెళ్లారన్నారు. తమిళనాడులో పట్టుబడిన సొమ్ముకు సంబంధించిన వాస్తవాలను బయటపెట్టాలని బొత్స కోరారు. తమిళనాడులో మూడు కంటైనర్లలో తరలిస్తున్న రూ. 570కోట్లు పట్టుబడ్డాయి. పోలీసులు కంటైనర్లను ఆపగానే వాటి వెంట వస్తున్న మూడు కార్లలోని వారు పరారయ్యారు. వారిని తమిళనాడు పోలీసులు వెంటాడి నిలువరించారు. వారిని ప్రశ్నించగా పొంతన లేనిసమాధానాలు చెప్పారు. తాము ఏపీ పోలీసులమని తొలుత చెప్పారు. ఐడీ కార్డు చూపించాల్సిందిగా తమిళ పోలీసులు డిమాండ్ చేయడంతో తెల్లమొహాలేశారు. విశాఖలో బ్యాంకుకు ఈ సొమ్ము తరలిస్తున్నామని మరో మాటచెప్పారు. అయితే అందుకు సంబంధించిన డాక్యుమెంట్లు చూపించలేకపోయారు. దీంతో పోలీసులు సొమ్మును సీజ్ చేశారు. దర్యాప్తు చేస్తున్నారు.

Click on Image to Read:

 

Tags:    
Advertisement

Similar News