భార్య‌ల‌ను మార్చుకునే ఆట‌...ఒప్పుకోనందుకు వేధించారు!

భార్య‌ల‌ను మార్చుకునే ఆట‌లో పాల్గొనేందుకు నిరాక‌రించిన ఒక యువ‌తి కేసు విష‌యంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసు విచార‌ణ నిమిత్తం ఒక ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని గురువారం ఆదేశించింది.  మూడునెల‌ల‌లో కేసు ద‌ర్యాప్తుని పూర్తి చేయాల‌ని కోర్టు కోరింది.  ప్ర‌ధాన న్యాయ‌మూర్తి టిఎస్ ఠాకూర్‌, న్యాయ‌మూర్తులు ఆర్ భానుమ‌తి, యుయు ల‌లిత్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పుని ఇచ్చింది. కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే…..కొచ్చికి చెందిన కొంత‌మంది నౌకాద‌ళం అధికారులు భార్య‌లను మార్చుకునే  […]

Advertisement
Update:2016-05-13 08:24 IST

భార్య‌ల‌ను మార్చుకునే ఆట‌లో పాల్గొనేందుకు నిరాక‌రించిన ఒక యువ‌తి కేసు విష‌యంలో సుప్రీంకోర్టు స్పందించింది. ఈ కేసు విచార‌ణ నిమిత్తం ఒక ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల‌ని కేర‌ళ ప్ర‌భుత్వాన్ని గురువారం ఆదేశించింది. మూడునెల‌ల‌లో కేసు ద‌ర్యాప్తుని పూర్తి చేయాల‌ని కోర్టు కోరింది. ప్ర‌ధాన న్యాయ‌మూర్తి టిఎస్ ఠాకూర్‌, న్యాయ‌మూర్తులు ఆర్ భానుమ‌తి, యుయు ల‌లిత్‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ తీర్పుని ఇచ్చింది. కేసు పూర్వాప‌రాల్లోకి వెళితే…..కొచ్చికి చెందిన కొంత‌మంది నౌకాద‌ళం అధికారులు భార్య‌లను మార్చుకునే వికృత క్రీడ‌తో పార్టీలు చేసుకుంటూ, ఇందుకు అంగీక‌రించ‌ని ఒక అధికారి భార్య‌ని తీవ్రంగా హింసించారు.

2012లో పెళ్ల‌యిన బాధితురాలు, పెళ్ల‌యిన సంవ‌త్స‌రానికి 2013 ఏప్రిల్‌లో త‌న‌ను త‌న భ‌ర్త‌, అత్త‌మామలు, ఆడ‌ప‌డుచు వేధిస్తున్నార‌ని, మాన‌సికంగా శారీర‌కంగా హింసిస్తున్నార‌ని కొచ్చి హార్బ‌ర్ పోలీస్ స్టేష‌న్లో కేసు పెట్టింది. త‌రువాత మ‌రొక ఫిర్యాదులో ఐదుగురు నేవీ అధికారులు, వారిలోని ఒక‌రి భార్య త‌న‌ని లైంగికంగా వేధించారంటూ పేర్కొంది. భార్య‌ల‌ను మార్చుకునే వికృత క్రీడ‌లో తాను పాల్గొన‌నందుకే త‌న‌ను బాధ‌లు పెట్టార‌ని ఆమె త‌న ఫిర్యాదులో తెలిపింది. త‌న భ‌ర్త త‌న‌ను చాలా సార్లు అలాంటి పార్టీల‌కు రావాల్సిందిగా కోరాడ‌ని చెబుతూ అందుకు రుజువులుగా ఉన్న ఆహ్వాన‌ప‌త్రాల‌ను కూడా ఆమె స‌బ్మిట్ చేసింది. త‌న భ‌ర్త ఒక సీనియ‌ర్ అధికారి భార్య‌తో స‌న్నిహితంగా ఉండ‌గా తాను చూశాన‌ని, అప్ప‌టినుండి వారంతా త‌న‌పై క‌క్ష క‌ట్టార‌ని, త‌న భ‌ర్త స్నేహితులు, కొలీగ్స్‌, పై అధికారులు కూడా త‌న‌ను లైంగిక వేధింపుల‌కు గురిచేశార‌ని ఆమె పేర్కొంది. గ‌తంలో ఒక‌సారి ఆమె త‌న‌కు ప్రాణ‌హాని ఉన్నందున త‌న కేసుని కేర‌ళ హైకోర్టునుండి ఢిల్లీ హైకోర్టుకి మార్చాల్సిందిగా సుప్రీం కోర్టుని కోరింది. కానీ సుప్రీంకోర్టు అందుకు అంగీక‌రించ‌లేదు. ఈసారి త‌న కేసుని సిబిఐతో విచార‌ణ జ‌రిపించాల్సిందిగా కోర‌గా, నిరాక‌రించిన సుప్రీంకోర్టు, ఈ కేసులో ఉన్న నిజాలు, ప‌రిస్థితుల‌ను బ‌ట్టి కేర‌ళ పోలీసులే స‌మ‌ర్ధ‌వంతంగా విచార‌ణ చేయ‌గ‌ల‌ర‌ని భావిస్తూ, ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా కేర‌ళ ప్ర‌భుత్వాన్ని ఆదేశించింది.

Tags:    
Advertisement

Similar News