రాసిఖన్నాకు హీరోయిన్ గా ఆవిషయంపై అవగాహన ఉందట
సినిమాలు అనేవి రావడానికంటే ముందు కదిలే బొమ్మలే హీరో, హీరోయిన్స్. అక్కడ జెండర్ ఇష్యూ పెద్దగా ఉండేది కాదు. క్రమేపి సినిమా మేకింగ్ డెవలప్ అయిన తరువాత తొలి దశలో కథలకు అగ్రపీఠం వేశారు. ఆ తరువాత నిదానంగా సినిమా అంటే హీరో సెంటర్ అనే పద్దతి వచ్చింది. అది ఇప్పుడు బలపడింది. దీంతో కథ అంతా హీరో చేసే ప్రయాణముగా మారింది.ఇప్పటి చాలా సినిమాల్లో హీరోయిన్ అంటే 6 పాటల్లో హీరో పక్కన కనిపించి చివర్లో […]
సినిమాలు అనేవి రావడానికంటే ముందు కదిలే బొమ్మలే హీరో, హీరోయిన్స్. అక్కడ జెండర్ ఇష్యూ పెద్దగా ఉండేది కాదు. క్రమేపి సినిమా మేకింగ్ డెవలప్ అయిన తరువాత తొలి దశలో కథలకు అగ్రపీఠం వేశారు. ఆ తరువాత నిదానంగా సినిమా అంటే హీరో సెంటర్ అనే పద్దతి వచ్చింది. అది ఇప్పుడు బలపడింది. దీంతో కథ అంతా హీరో చేసే ప్రయాణముగా మారింది.ఇప్పటి చాలా సినిమాల్లో హీరోయిన్ అంటే 6 పాటల్లో హీరో పక్కన కనిపించి చివర్లో హీరోను పెళ్లి చేసుకోవడానికి మాత్రమే అన్నట్లు డిజైన్ చేస్తున్నారు. అయితే అప్పడప్పుడు కొన్ని వుమెన్ ఓరియెంటెడ్ చిత్రాలు వస్తున్నప్పటికి అవేమి హీరోయిన్ గా వాళ్ల ప్రాధాన్యతను పెంచే విధంగా అయితే లేవనే చెప్పాలి.
సో మొత్తం మీద హీరోయిన్ అంటే గ్లామర్ డాల్ అనేది ప్రస్తుతం నడుస్తున్న స్టేజ్. దీనికి కొన్ని మహిళ ప్రాధాన్యం వున్న కథలు మినహాయింపు. అయితే హీరోయిన్ అంటే కేవలం గ్లామర్ కు మాత్రమే అంటే రాసిఖన్నాకు నచ్చదట. కథ డిమాండ్ చేసినట్లు హీరోయిన్ ను చూపించడం లో తప్పు లేదు కానీ.. హీరోయిన్ అంటే అందాల ఆరబోతకు మాత్రమే అనే దృక్పథమే తనకు నచ్చదట. ఊహాలు గుసగుసలాడే చిత్రంతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సాయిధరమ్ తేజ తో సుప్రీమ్ చిత్రంతో అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ ప్రస్తుత్తం గోపిచంద్ తో ఆక్సిజన్ చిత్రం చేస్తుంది.