పెళ్లి ఆలోచ‌న లో స‌మంత‌..!

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోవ‌డం చాల క‌ష్టం. దానిని నిల‌బెట్టుకోవ‌డం మ‌రింత క‌ష్టం. అయితే ప్ర‌స్తుతానికి ఈ హోదాను ఎంజాయ్ చేస్తున్న స‌మంత మాత్రం కెరీర్ ప‌రంగా బెస్ట్ స్టేజ్ లో ఉంద‌నే చెప్పాలి. ఒక్క యేడాదిలో దాదాపు 4 నుంచి 5 చిత్రాలు ఆమే న‌టించిన‌వి రిలీజ్ కావ‌డమే అంద‌కు తార్కాణం. ఇప్ప‌టికే విజయ్, సూర్య లతో చేసిన చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా బ్ర‌హ్మోత్స‌వంతో రానుంది. ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం […]

Advertisement
Update:2016-05-11 11:06 IST

ఇండ‌స్ట్రీలో స్టార్ హీరోయిన్ హోదా సంపాదించుకోవ‌డం చాల క‌ష్టం. దానిని నిల‌బెట్టుకోవ‌డం మ‌రింత క‌ష్టం. అయితే ప్ర‌స్తుతానికి ఈ హోదాను ఎంజాయ్ చేస్తున్న స‌మంత మాత్రం కెరీర్ ప‌రంగా బెస్ట్ స్టేజ్ లో ఉంద‌నే చెప్పాలి. ఒక్క యేడాదిలో దాదాపు 4 నుంచి 5 చిత్రాలు ఆమే న‌టించిన‌వి రిలీజ్ కావ‌డమే అంద‌కు తార్కాణం. ఇప్ప‌టికే విజయ్, సూర్య లతో చేసిన చిత్రాలు రిలీజ్ అయ్యాయి. తాజాగా బ్ర‌హ్మోత్స‌వంతో రానుంది. ఎన్టీఆర్ తో జ‌న‌తా గ్యారేజ్ చిత్రం చేస్తుంది.

అయితే వ‌ర‌స‌గా చిత్రాలు చేయ‌డం త‌న పై ఒకింత ఒత్తిడి ఉంద‌నే విష‌యం స‌మంత గుర్తించింది. దీంతో త‌మిళ్ లో ధ‌నుష్ తో అంగీక‌రించిన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన త‌రువాత స‌మంత కొంత కాలం సినిమాల‌కు గ్యాప్ తీసుకోవాల‌నే ఆలోచ‌న‌లో ఉంద‌ట‌. దీంతో స‌మంత పెళ్లి ఆలోచ‌న చేస్తుందేమో అనే టాక్ స్ర్పెడ్ అయ్యింది. ప్ర‌స్తుతం త‌న వ‌య‌సు 29 సంవ‌త్స‌రాల‌ని.. ఇక పెళ్లి చేసుకోవ‌డం బెట‌ర‌నే టైప్ లో చెప్పుకొచ్చింది. అయితే కెరీర్ త‌ను ఊహించిన దానికంటే ఉన్న‌త స్థితిలో సాగుతుంటే.. పెళ్లి చేసుకుని సినిమాల‌కు దూరం అవుతుందా అనేది మిలియ‌న్ డాల‌ర్ల ప్ర‌శ్న‌.! ఎందుకంటే చాల మంది హీరోయిన్స్ వ‌య‌సుతో సంబంధం లేకుండా మ‌రి కాస్త కాలం గ్లామ‌ర్ హీరోయిన్ గా హ‌ల్ చ‌ల్ చేయాల‌ని చూస్తున్నారు మ‌రి.

Tags:    
Advertisement

Similar News