స‌మంతను అర్ధ‌గంట ఏడ్పించారు..!

అటు అందం..ఇటు న‌ట‌న‌తోను అభిమానుల్ని ముగ్దుల్ని చేసే హీరోయిన్స్ లో స‌మంత ఒక‌రు. వేస‌వ‌ని టార్గెట్ చేసుకుని వ‌స్తున్న నాలుగు ప్ర‌ధాన చిత్రాల్లో ఆమే నాయక‌గా అల‌రించ‌నుంది. అల్రేడి విజ‌య్ తో చేసిన పోలీసు చిత్రం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుత్తం 24 చిత్రంతో అభిమానుల్ని మెప్పిస్తుంది. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు తో చేసిన బ్ర‌హ్మోత్స‌వం చిత్రం రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఈ సినిమాల కోసం దాదాపు 8 నెల‌ల నుంచి కంటిన్యూస్ […]

Advertisement
Update:2016-05-11 07:39 IST

అటు అందం..ఇటు న‌ట‌న‌తోను అభిమానుల్ని ముగ్దుల్ని చేసే హీరోయిన్స్ లో స‌మంత ఒక‌రు. వేస‌వ‌ని టార్గెట్ చేసుకుని వ‌స్తున్న నాలుగు ప్ర‌ధాన చిత్రాల్లో ఆమే నాయక‌గా అల‌రించ‌నుంది. అల్రేడి విజ‌య్ తో చేసిన పోలీసు చిత్రం రిలీజ్ అయ్యి మంచి టాక్ తెచ్చుకుంది. ప్ర‌స్తుత్తం 24 చిత్రంతో అభిమానుల్ని మెప్పిస్తుంది. త్వ‌ర‌లో మ‌హేష్ బాబు తో చేసిన బ్ర‌హ్మోత్స‌వం చిత్రం రిలీజ్ కు సిద్దం అయ్యింది. ఈ సినిమాల కోసం దాదాపు 8 నెల‌ల నుంచి కంటిన్యూస్ గా వ‌ర్కు చేస్తుంద‌ట‌.

అయితే ఈ మ‌ధ్య బ్ర‌హ్మోత్స‌వం చిత్రం షూటింగ్ లో భాగంగా..ఉద‌య్ పూర్ లో షూట్ పూర్తి చేసుకుని పూనే లో ఒక హోట‌ల్ కు రాగానే స‌మంత ఆప‌కుండా అర్ధగంట ఏడ్చేసింద‌ట‌. చేతినిండా చిత్రాలు.. ఫుల్ ఫాలోయింగ్ వున్న స‌మంత ఏడవాలిసిన ప‌ని ఏముంది..? స‌మంత‌ను ఏడిపించిన కార‌ణం ఏమై వుంటుంది అంటే.. ? త‌న‌కు తానే వివ‌ర‌ణ ఇచ్చుకుంది. ఏడ‌వ‌టానికి ఏం జర‌గ‌లేదు కానీ.. ఫ్యామిలీ, ఫ్రెండ్స్ అంద‌ర్నీ మ‌రిచి పోయి.. 8 నెల‌లుగా రాత్రి ప‌గలు సినిమాల షూటింగ్ తో బిజి గా ఉండ‌టం.. దీంతో తెలియ‌కుండానే ఒక విధ‌మైన ప‌ని ఒత్తిడి బిల్డ్ అయ్యింది. ఇలా ఫ్యామిలి..ఫ్రెండ్స్, ప‌ని ఒత్తిడి కి సంబంధించి కార‌ణాలు ఆ ఏడుపులో ఉన్నాయోమో అని విశ్లేష‌ణ తో క్లారీటి ఇచ్చుకుంది. సో ఒక్కోసారి ఏడుపు కూడా ఒక విధ‌మైన రిలీఫే క‌దా.! మైండ్ లో ఉన్న బ‌రువంత ఏడుపు రూపంలో బ‌య‌ట‌కు వెళ్లిపోతుంది మ‌రి.

Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News