బాలయ్య వందో సినిమా టైటిల్ సాంగ్...?
గౌతమీపుత్ర శాతకర్ణిలో టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యోధుడు..యోధుడు..అనే పల్లవితో ప్రారంభమయ్యే పాట వైరల్ అవుతోంది. అయితే ఇది సినిమా యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్ కాదు. ప్రముఖ గీతరచయిత సిరాశ్రీ రాసిన పాట. రవిశంకర్ సంగీతం అందించారు. గీతరచయిత తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ముందే రాసి.. పాటను షేర్ చేశాడు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్రప్రశస్తి చదివానని… పుస్తకం చదవడం పూర్తయిందో లేదో.. పాట వ్రాయాలని కోరిక బలంగా […]
Advertisement
గౌతమీపుత్ర శాతకర్ణిలో టైటిల్ సాంగ్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. యోధుడు..యోధుడు..అనే పల్లవితో ప్రారంభమయ్యే పాట వైరల్ అవుతోంది. అయితే ఇది సినిమా యూనిట్ రిలీజ్ చేసిన సాంగ్ కాదు. ప్రముఖ గీతరచయిత సిరాశ్రీ రాసిన పాట. రవిశంకర్ సంగీతం అందించారు. గీతరచయిత తన అఫీషియల్ ఫేస్‌బుక్ పేజీలో ముందే రాసి.. పాటను షేర్ చేశాడు. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ఆంధ్రప్రశస్తి చదివానని… పుస్తకం చదవడం పూర్తయిందో లేదో.. పాట వ్రాయాలని కోరిక బలంగా నాటుకుపోయిందని అన్నాడు సిరాశ్రీ. అందుకే ఈ పాట రాసి ఫేస్ బుక్ లో పెట్టానని చెప్పుకొచ్చాడు. గాయకుడు రోహిత్ ఈ పాటకు మరింత వన్నె తెచ్చాడని సిరాశ్రీ చెప్పుకొచ్చాడు. తాము విడుదల చేసిన ఈ పాటలకు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు ఎటువంటి సంబంధందలేదని కూడా వివరణ ఇచ్చారు. మనకు తెలియని మన చరిత్రను ఒక దృశ్యకావ్యంగా తెరకెక్కిస్తున్న దర్శకుడు క్రిష్, బాలకృష్ణలను అభినందించిన సిరాశ్రీ… శాతకర్ణి ప్రాజెక్టు పట్ల అభిమానంతో రాసిన పాటే తప్పించి, సినిమాకు సంబంధించనది కాదని తన ఫేస్‌బుక్ అక్కౌంట్‌లో రాసుకున్నారు. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్… న్యూయార్క్ లో జరుగుతున్నాయి.
Advertisement