మహిళలు ఫేస్‌బుక్ ఖాతాలను డిలీట్ చేయాలి...లండన్ మసీదుల ఆదేశం!
లండన్‌లోని కొన్ని మసీదులు మహిళలపై కొన్ని రకాల ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహిళలు తమ ఫేస్‌బుక్ ఖాతాలను డిలీట్ చేయాలని, భర్త అనుమతి లేకుండా ఇంట్లోంచి బయటకు రాకూడదని, ప్యాంటులు వాడకూడదనే నిబంధనలు అందులో ఉన్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా ఇలాంటి నిబంధనలను విధించిన మసీదులపై టైమ్స్ పత్రిక ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నార్త్ ఈస్ట్ ఇంగ్లండు, బ్లాక్‌బర్న్‌లోని కేంద్ర మసీదు… డేంజర్స్ ఆఫ్ ఫేస్‌బుక్ పేరుతో ఒక వెబ్ పోస్టుని ప్రచురించింది. ఫేస్‌బుక్, పాపాలకు తలుపులు […]
లండన్‌లోని కొన్ని మసీదులు మహిళలపై కొన్ని రకాల ఆంక్షలు విధిస్తూ నిర్ణయం తీసుకున్నాయి. మహిళలు తమ ఫేస్‌బుక్ ఖాతాలను డిలీట్ చేయాలని, భర్త అనుమతి లేకుండా ఇంట్లోంచి బయటకు రాకూడదని, ప్యాంటులు వాడకూడదనే నిబంధనలు అందులో ఉన్నాయి. బ్రిటన్ వ్యాప్తంగా ఇలాంటి నిబంధనలను విధించిన మసీదులపై టైమ్స్ పత్రిక ఒక అధ్యయనం నిర్వహించింది. అందులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. నార్త్ ఈస్ట్ ఇంగ్లండు, బ్లాక్‌బర్న్‌లోని కేంద్ర మసీదు… డేంజర్స్ ఆఫ్ ఫేస్‌బుక్ పేరుతో ఒక వెబ్ పోస్టుని ప్రచురించింది.
ఫేస్‌బుక్, పాపాలకు తలుపులు తెరుస్తున్నదని, ముస్లిం బాలికలు, మహిళలు వాటికి బలవుతున్నారని ఆ వెబ్‌పోస్టులో పేర్కొన్నారు. ప్యాంటులు మహిళ శరీర తీరుని స్పష్టంగా చూపిస్తాయని, ప్యాంటులను మగవారే ధరించాలని ఆడవారు మగవారిని అనుకరిస్తే ప్రవక్త క్షమించడని అందులో పేర్కొన్నారు. అయితే లండన్లోని ఇస్లామిక్ షరియా కౌన్సిల్‌లో స్కాలర్ అయిన ఖోలా హసన్ అనే మహిళ ఈ అభిప్రాయాలన్నీ పితృస్వామ్య భావజాలం నుండి వచ్చినవనీ, కాలం చెల్లినవనీ పేర్కొంది. అయితే ఇలాంటి నిబంధనలు విధించిన మసీదుల్లో చాలావరకు ముస్లిం కౌన్సిల్ ఆఫ్ బ్రిటన్ (ఎమ్‌సిబి)లో సభ్యులుగా ఉన్నవే ఉన్నాయి. ఎమ్‌సిబి, యుకెలోని అనేక మసీదులు, స్కూళ్లు, ఇతర సంస్థలకు ప్రాతినిథ్యం వహిస్తున్న సంస్థ.