మరోసారి పెద్ద బాబుల మధ్య యుద్ధం తప్పదా...

గతంలో సినిమాల మధ్య పోటీ అంటే చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాత్రమే వార్ కనిపించేది. మధ్యలో నాగార్జున, వెంకటేశ్ తమ సినిమాలతో పోటీలో నిలిచినప్పటికీ…. ప్రధానమైన రేసు మాత్రం చిరు, బాలయ్య మధ్యే ఎప్పుడూ కనిపించేది. రికార్డులు తిరగరాయాలన్నా… మాస్ సినిమాలు చేయాలన్నా… అఖండ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోవాలన్నా… వీళ్లిద్దరి మధ్యే వార్ నడిచేది. అలాంటి బాక్సాఫీస్ వార్ ఘట్టాలు చిరంజీవి, బాలయ్య మధ్య ఇటీవల పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి కారణం చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడమే. […]

Advertisement
Update:2016-05-04 12:04 IST
గతంలో సినిమాల మధ్య పోటీ అంటే చిరంజీవి-బాలకృష్ణ మధ్య మాత్రమే వార్ కనిపించేది. మధ్యలో నాగార్జున, వెంకటేశ్ తమ సినిమాలతో పోటీలో నిలిచినప్పటికీ…. ప్రధానమైన రేసు మాత్రం చిరు, బాలయ్య మధ్యే ఎప్పుడూ కనిపించేది. రికార్డులు తిరగరాయాలన్నా… మాస్ సినిమాలు చేయాలన్నా… అఖండ ఫ్యాన్ ఫాలోయింగ్ తో దూసుకుపోవాలన్నా… వీళ్లిద్దరి మధ్యే వార్ నడిచేది. అలాంటి బాక్సాఫీస్ వార్ ఘట్టాలు చిరంజీవి, బాలయ్య మధ్య ఇటీవల పూర్తిగా తగ్గిపోయాయి. దీనికి కారణం చిరంజీవి పాలిటిక్స్ లోకి వెళ్లిపోవడమే. మరోవైపు బాలయ్య మాత్రం సింహా, లెజెండ్ అంటూ రికార్డుల మీద రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు. తాజాగా ఈ ఇద్దరు బడా స్టార్ల మధ్య మరోసారి పోటీ రానుందనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.
బాలయ్య వందో సినిమా, చిరంజీవి 150వ సినిమా తక్కువ గ్యాప్ లోనే ప్రారంభమయ్యాయి. రెండూ సైమల్టేనియస్ గా షూటింగ్ జరుపుకునే అవకాశముంది. ఇలా చూస్తే ఈ రెండూ ఒకేసారి థియేటర్లలోకి వచ్చే అవకాశం కూడా ఉంది. దీంతో బాలయ్య కాస్త ముందుగానే మేల్కొన్నారు. తన సినిమాపై క్లారిటీ ఇస్తూ… గౌతమీపుత్ర శాతకర్ణి మూవీని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటించారు. సంక్రాంతికి బాలయ్యకు మంచి ట్రాక్ రికార్డు ఉంది. కెరీర్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు సంక్రాంతికి విడుదల చేసినవే.
సేమ్ టైం… చిరంజీవి కూడా తన 150వ సినిమాను సంక్రాంతికే విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే కనుక నిజమైతే… బాలకృష్ణ-చిరంజీవి మధ్య మరోసారి బాక్సాఫీస్ వార్ తప్పకపోవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే మెగాఫ్యాన్స్ మాత్రం మరోలా వాదిస్తున్నారు. బాలయ్య సినిమాకు సెట్స్ వేయడానికి, షూటింగ్ చేయడానికి చాలా టైం పడుతుందని… చిరంజీవి సినిమా కాస్త ముందుగానే వచ్చేస్తుందని అంటున్నారు. సినిమా ప్రారంభమై… కొన్ని షెడ్యూల్స్ ముగిసేవరకు ఎవరి సినిమా ముందు వస్తుందో చెప్పలేం.
Tags:    
Advertisement

Similar News