బాలీవుడ్ భామలతో అఖిల్ ఫొటోషూట్  

మొదటి సినిమాతో అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న అక్కినేని సిసింద్రీ అఖిల్ ఎట్టకేలకు వంశీ పైడిపల్లి చేతిలో పడ్డాడు. ఊపిరి సినిమాతో నాగార్జునను మెప్పించిన వంశీ పైడిపల్లి… అఖిల్ రెండో సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎంతోమంది దర్శకుల్ని వద్దనుకున్న తర్వాత ఆ అవకాశాన్ని పైడిపల్లికి ఇచ్చాడు నాగార్జున. అంతేకాదు… అఖిల్ రెండో సినిమాకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. వాస్తవానికి హిందీలో హిట్టయిన యే జవానీ హే దీవానీ అనే సినిమాను రీమేక్ చేస్తూ… […]

Advertisement
Update:2016-05-04 12:04 IST
మొదటి సినిమాతో అట్టర్ ఫ్లాప్ తెచ్చుకున్న అక్కినేని సిసింద్రీ అఖిల్ ఎట్టకేలకు వంశీ పైడిపల్లి చేతిలో పడ్డాడు. ఊపిరి సినిమాతో నాగార్జునను మెప్పించిన వంశీ పైడిపల్లి… అఖిల్ రెండో సినిమాను డైరక్ట్ చేసే ఛాన్స్ కొట్టేశాడు. ఎంతోమంది దర్శకుల్ని వద్దనుకున్న తర్వాత ఆ అవకాశాన్ని పైడిపల్లికి ఇచ్చాడు నాగార్జున. అంతేకాదు… అఖిల్ రెండో సినిమాకు సంబంధించి పూర్తి స్వేచ్ఛ కూడా ఇచ్చాడు. వాస్తవానికి హిందీలో హిట్టయిన యే జవానీ హే దీవానీ అనే సినిమాను రీమేక్ చేస్తూ… అఖిల్ హీరోగా రెండో సినిమాను తెరకెక్కించాలనుకున్నారు.
కానీ ఈ ప్రతిపాదనకు వంశీ పైడిపల్లి ఒప్పుకోలేదు. మరో కొత్త కథతో నాగార్జున, అఖిల్ ను మెప్పించి ఒప్పించాడు. ఇలా సినిమాకు సంబంధించి ప్రతి అంశంలో తన ముద్ర కనిపించేలా చేస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన చాలా అంశాల్ని వెల్లడించాడు. అఖిల్ ను ఓ కొత్త కథ ద్వారా ప్రజెంట్ చేస్తున్నానని చెప్పిన పైడిపల్లి… లైలా ఓ లైలా అనే టైటిల్ ను కూడా ఫిక్స్ చేసినట్టు ప్రకటించాడు.
అన్నపూర్ణ స్టుడియోస్ బ్యానర్ పై ఈ టైటిల్ ను ఇప్పటికే ఫిలిం ఛాంబర్ లో రిజిస్టర్ చేయించారు. మరోవైపు హీరోయిన్ ఎంపికలో కూడా తనదైన ముద్ర ఉండేలా చూసుకుంటున్నాడు దర్శకుడు. బాలీవుడ్ కు చెందిన ముగ్గురు భామలతో అఖిల్ తో ఫొటో షూట్ ఏర్పాటుచేసే పనిలో పడ్డాడు. ఈ ఫొటో షూట్ కంప్లీట్ అయిన తర్వాత మాత్రమే అఖిల్ రెండో ప్రాజెక్టుకు హీరోయిన్ ఎవరనేది ఎంపిక చేయాలనుకుంటున్నాడు. ఎందుకంటే… తను తీయబోతున్న రొమాంటిక్ ఎంటర్ టైనర్ కు ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ బాగా అవసరం. తెరపై హీరోహీరోయిన్లు ఎంత ఒద్దికగా కలిసిపోతే సినిమా అంత పండుతుంది. అందుకే సెట్స్ పైకి వెళ్లకముందే ఫొటో షూట్ల ద్వారా హీరోయిన్ ను ఫైనలైజ్ చేయాలని పైడిపల్లి నిర్ణయించాడు.
Tags:    
Advertisement

Similar News