ఈ తలనొప్పి ఏంటయ్యా..!

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో రెండు కుంపట్ల గోల తగ్గడం లేదు. భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ వేడి పార్టీ అధినేత వరకు తాకుతోంది. చంద్రబాబు దగ్గర  కలిసి పనిచేసుకుంటామని తలూపుతున్న రెండు వర్గీయులు… నంద్యాలకు వెళ్లాక తిరిగి తకరారు పెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భూమా, శిల్పా లను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. సోమవారం రాత్రి ఒక దఫా చర్చలు జరిపిన చంద్రబాబు… మంగళవారం ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. […]

Advertisement
Update:2016-05-03 06:22 IST

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీలో రెండు కుంపట్ల గోల తగ్గడం లేదు. భూమా నాగిరెడ్డి, శిల్పామోహన్ రెడ్డి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఆ వేడి పార్టీ అధినేత వరకు తాకుతోంది. చంద్రబాబు దగ్గర కలిసి పనిచేసుకుంటామని తలూపుతున్న రెండు వర్గీయులు… నంద్యాలకు వెళ్లాక తిరిగి తకరారు పెట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో మరోసారి భూమా, శిల్పా లను చంద్రబాబు పిలిపించుకుని మాట్లాడారు. సోమవారం రాత్రి ఒక దఫా చర్చలు జరిపిన చంద్రబాబు… మంగళవారం ఉదయం మరోసారి సమావేశం అయ్యారు. నాగిరెడ్డి, అఖిలప్రియ, శిల్పా సోదరులను విడివిడిగా పిలిచిమాట్లాడారు. నంద్యాల టీడీపీలో విభేదాలు తరచు రచ్చకెక్కడంపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ తలనొప్పులేంటని మండిపడినట్టు చెబుతున్నారు. మీ వల్ల జిల్లాలో పార్టీకి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారని తెలుస్తోంది.

చంద్రబాబు వద్ద ఎప్పటిలాగే రెండు వర్గాలు పరస్పరం ఫిర్యాదులు చేసుకున్నాయి. భూమా పార్టీలోకి వచ్చిన తర్వాతే నియోజకవర్గంలో పరిస్థితులు అదుపు తప్పుతున్నాయని శిల్పా సోదరులు ఫిర్యాదు చేస్తున్నారు. పార్టీలో చేరిన మరుసటి రోజు నుంచే తమ వర్గీయులపై భూమా వర్గీయులు దాడులు చేస్తున్నారని చెప్పారు. ఇటీవల శిల్పా ముఖ్య అనుచరుడు తులసిరెడ్డిపై వేటకొడవళ్లలో దాడి కూడా భూమా వర్గమే చేయించిందని గుర్తు చేశారు. విభేదాలు పక్కనపెట్టి పనిచేస్తామని భూమా, శిల్పా చెప్పినట్టు జిల్లా ఇన్ చార్జ్ మంత్రి అచ్చెన్నాయుడు వెల్లడించారు. అయితే వీరు కలిసి పనిచేసే పరిస్థితులు లేవని నేతలంటున్నారు. వచ్చే ఎన్నికల నాటికి పార్టీలో ఎవరో ఒకరే ఉండాలన్నట్టుగా వీరి తీరు ఉందని జిల్లా నేతలు అభిప్రాయపడుతున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News