జనం బాగానే వచ్చారే!
గుంటూరు జిల్లా మాచర్లలో జగన్ కరువు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు జనం పోటెత్తారు. ఊహించిన దాని కంటే అధికంగానే జనస్పందన ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రసంగించే సరికి ఒంటి గంట అయింది. ఎండ తీవ్రస్థాయిలో కనిపించింది. అయినా జనం వేలాదిగా తరలివచ్చారు. ధర్నా ప్రాంతంలో దారులన్నీ స్తంభించిపోయాయి. ధర్నాను ఉద్దేశించి ప్రసంగించిన జగన్… చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపడ్డారు. అధికారంలోకి రాకముందు అన్నీ చేస్తానని చెప్పిన చంద్రబాబు… అధికారం చేతిలోకి […]
గుంటూరు జిల్లా మాచర్లలో జగన్ కరువు ధర్నా నిర్వహించారు. తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించిన ధర్నాకు జనం పోటెత్తారు. ఊహించిన దాని కంటే అధికంగానే జనస్పందన ఉందని వైసీపీ నేతలు చెబుతున్నారు. జగన్ ప్రసంగించే సరికి ఒంటి గంట అయింది. ఎండ తీవ్రస్థాయిలో కనిపించింది. అయినా జనం వేలాదిగా తరలివచ్చారు. ధర్నా ప్రాంతంలో దారులన్నీ స్తంభించిపోయాయి. ధర్నాను ఉద్దేశించి ప్రసంగించిన జగన్… చంద్రబాబు తీరును తీవ్రంగా తప్పుపడ్డారు.
అధికారంలోకి రాకముందు అన్నీ చేస్తానని చెప్పిన చంద్రబాబు… అధికారం చేతిలోకి రాగానే అందరికీ పంగనామాలు పెడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో కరువు తాండవిస్తున్నా జనం తాగేందుకు మంచినీళ్లు కూడా లేక అలమటిస్తున్నా చంద్రబాబు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. రైతులకు గతేడాది ఇన్‌పుట్ సబ్సిడీ కూడా చెల్లించకుండా పంగనామాలు పెట్టారన్నారు. రైతులు, కూలీలు వలసపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఉపాధి కూలీల కోసం కేంద్రం రూ.4500 కోట్లు కేటాయిస్తే సిమెంట్ రోడ్లకు వెయ్యి కోట్లు, నీరు-చెట్టుకు రూ.2500 కోట్లు మళ్లించారు.
ఉపాధి నిధులను మళ్లించడం ఎంతవరకు న్యాయం. ఉపాధిహామీ పథకాన్ని చంద్రబాబు నీరుగారుస్తున్నారు. పక్కనే నాగార్జున సాగర్ ఉన్నా మాచర్లలో నీళ్లు దొరకని పరిస్థితి. శ్రీశైలంలో నీళ్లులేవు, అక్కడ నిండితే కానీ, సాగర్కు నీళ్లు రావు. రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది.
ఓ వైపు చుక్క నీటి కోసం రైతులను అష్టకష్టాలు పడుతుంటే చంద్రబాబు మాత్రం కోట్లు ఖర్చుపెట్టి సంతలో పశువుల్ని కొన్నట్లు ఎమ్మెల్యేలను కొంటున్నారని జగన్ మండిపడ్డారు. మోసపూరిత వాగ్దానాలతో గద్దెనెక్కిన చంద్రబాబును క్షమించకూడదు అని అన్నారు.
Click on Image to Read: