ఆ సెంటిమెంట్ తోనే క్లాప్ కొట్టే ఛాన్స్
చిరంజీవి 150వ సినిమా. అభిమానులు ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. మెగా కాంపౌండ్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా. చిరంజీవి కెరీర్ లోనే మైలురాయి లాంటి సినిమా. మరి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి తొలి క్లాప్ కొట్టే అవకాశం ఎవరికి లభిస్తుంది చెప్పండి. చిరంజీవికి ఉండే ఇమేజ్ కు తగ్గట్టు ఏ పెద్ద రాజకీయ నాయకుడినో, లేకపోతే తన ఫ్యామిలీలోనే మరో సభ్యుడికి క్లాప్ కొట్టే అవకాశం వస్తుంది. కానీ చిరు 150వ సినిమాకు […]
Advertisement
చిరంజీవి 150వ సినిమా. అభిమానులు ఎన్నాళ్ల నుంచో వెయిట్ చేస్తున్న సినిమా. మెగా కాంపౌండ్ కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సినిమా. చిరంజీవి కెరీర్ లోనే మైలురాయి లాంటి సినిమా. మరి ఇంతటి ప్రతిష్టాత్మక చిత్రానికి తొలి క్లాప్ కొట్టే అవకాశం ఎవరికి లభిస్తుంది చెప్పండి. చిరంజీవికి ఉండే ఇమేజ్ కు తగ్గట్టు ఏ పెద్ద రాజకీయ నాయకుడినో, లేకపోతే తన ఫ్యామిలీలోనే మరో సభ్యుడికి క్లాప్ కొట్టే అవకాశం వస్తుంది. కానీ చిరు 150వ సినిమాకు క్లాప్ కొట్టింది పరుచూరి వెంకటేశ్వరరావు. ఎవరూ ఊహించని విధంగా పరుచూరి వెంకటేశ్వరరావు చిరు 150వ సినిమాకు క్లాప్ కొట్టడంతో…. అంతా ఆలోచనలో పడ్డారు. ప్రత్యేకించి పరుచూరిని పిలవడం వెనక కారణం ఏంటా అని ఆరా తీశారు. దీని వెనక ఓ సెంటిమెంట్ ఉందనే విషయాన్ని తెలుసుకున్నారు. గతంలో చిరంజీవి నటించిన ఖైదీ సినిమాకు పరుచూరి వెంకటేశ్వరరావే క్లాప్ కొట్టారు. అది పెద్ద హిట్టయింది. కేవలం హిట్టే కాదు…చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన చిత్రంగా నిలిచింది. అందుకే మళ్లీ ఇన్నేళ్లకు ఆ సెంటిమెంట్ ను బలపరుస్తూ పరుచూరికి క్లాప్ బోర్డు అందించారట చిరు.
Advertisement