శ‌రీర కొల‌త‌లు కాదు...ముఖ‌మే ముఖ్యం!

టైమ్స్ ఆఫ్ ఇండియా, హైద‌రాబాద్  టైమ్స్ నిర్వ‌హించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో అనుష్క అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌హిళ టైటిల్‌ని గెలుపొందింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, అది ప్రేక్ష‌కులు తెర‌మీద క‌నిపించిన అనుష్క‌కి ఇచ్చిన ఓటింగ్ అని,  తాను క‌నిపించిన పాత్ర‌లే ఈ టైటిల్ త‌న‌కు ద‌క్కేలా చేశాయ‌ని అనుష్క తెలిపింది. తాను శ‌రీర కొల‌త‌ల గురించి ఎప్పుడూ ప‌ట్టించుకోన‌ని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవ‌టం, ఫిట్‌గా ఉండ‌టం మీద దృష్టి పెడ‌తాన‌ని చెప్పింది. ఆక‌లి అయిన‌పుడే తింటాన‌ని, అల‌వాటుగా తినటం […]

Advertisement
Update:2016-05-01 00:09 IST

టైమ్స్ ఆఫ్ ఇండియా, హైద‌రాబాద్ టైమ్స్ నిర్వ‌హించిన ఆన్‌లైన్ ఓటింగ్‌లో అనుష్క అత్యంత ఆక‌ర్ష‌ణీయ‌మైన మ‌హిళ టైటిల్‌ని గెలుపొందింది. ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ, అది ప్రేక్ష‌కులు తెర‌మీద క‌నిపించిన అనుష్క‌కి ఇచ్చిన ఓటింగ్ అని, తాను క‌నిపించిన పాత్ర‌లే ఈ టైటిల్ త‌న‌కు ద‌క్కేలా చేశాయ‌ని అనుష్క తెలిపింది. తాను శ‌రీర కొల‌త‌ల గురించి ఎప్పుడూ ప‌ట్టించుకోన‌ని చ‌ర్మ సౌంద‌ర్యాన్ని కాపాడుకోవ‌టం, ఫిట్‌గా ఉండ‌టం మీద దృష్టి పెడ‌తాన‌ని చెప్పింది. ఆక‌లి అయిన‌పుడే తింటాన‌ని, అల‌వాటుగా తినటం ఉండ‌దంది. యోగా త‌న జీవితంలో భాగ‌మ‌ని, నిత్య జీవితంలో ఎన్నో విష‌యాల‌ను యోగా నిశ్శ‌బ్దంగా మ‌న‌కు నేర్పుతుంద‌ని అనుష్క అంది. స‌మ‌తౌల్యంలో ఉన్న శ‌రీరం, మ‌న‌సుల కంటే మ‌న‌ల్ని అందంగా ఉంచే క్రీమ్ మ‌రొక‌టి ఉండ‌ద‌ని ఆమె చెప్పింది. నిజాయితీగా ఉన్న మ‌గ‌వారు త‌న‌కు న‌చ్చుతార‌ని, క‌ళ్లలో ఆ నిజాయితీ క‌నిపించాల‌ని, అందుకే తాను స‌న్ గ్లాసెస్ పెట్టుకున్న‌మ‌గ‌వాడితో మాట్లాడ‌లేన‌ని, అలాగే మ‌గ‌వాడి న‌వ్వులు కూడా అతని గురించి చెబుతాయ‌ని అనుష్క అంది. ప‌ర్‌ఫెక్ట్ మ్యాన్ అంటే త‌న దృష్టిలో త‌న తండ్రేన‌ని ఆయ‌న స్థాయిలో ఇత‌రుల‌ను పోల్చి చూడ‌టం కాస్త క‌ష్ట‌మేన‌ని ఆమె తెలిపింది.

Tags:    
Advertisement

Similar News