‘’నన్ను క్రమశిక్షణతో పెంచారు… తాతను చూసి మనవడు బ్యార్‌మని ఏడ్చాడు’’

విశాఖలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంకుస్థాపన చేశారు.  ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశామన్నారు. 67 ఏళ్ల వయసులోనూ తన తండ్రి 16ఏళ్ల కుర్రాడిలా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. ఇంట్లో మనవడో మనవరాలో ఉంటే చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. కానీ తన […]

Advertisement
Update:2016-04-27 07:39 IST

విశాఖలో టీడీపీ కార్యాలయ నిర్మాణానికి టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా బహిరంగ సభలో లోకేష్ ప్రసంగించారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతిహామీని నెరవేర్చిన ఘనత టీడీపీకి మాత్రమే దక్కుతుందన్నారు. రైతులకు, డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేశామన్నారు.

67 ఏళ్ల వయసులోనూ తన తండ్రి 16ఏళ్ల కుర్రాడిలా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నారని చెప్పారు. ఇంట్లో మనవడో మనవరాలో ఉంటే చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుందన్నారు. కానీ తన ఇంట్లో తాత అమరావతిలో ఉంటే మనవడు హైదరాబాద్‌లో ఉంటున్నారని అన్నారు. ఇటీవల కేంద్ర మంత్రి సుజనాచౌదరి ఇంట్లో పెళ్లికి హాజరయ్యేందుకు వచ్చిన తన తండ్రి ఆ సమయంలో మనవుడిని ఎత్తుకునేందుకు ప్రయత్నించారని లోకేష్ గుర్తు చేశారు. అయితే మనవడు మాత్రం బ్యార్‌ మని ఏడ్చాడని ఈ పరిస్థితి చూస్తే ఏ తాతకైనా బాధ కలగదా అని లోకేష్ ప్రశ్నించారు.

తాను పుట్టినప్పుడే తన తాత సీఎం అని చెప్పారు. ఏడేళ్లుగా ఆస్తులు ప్రకటిస్తున్న కుటుంబం తమది అన్నారు. జగన్‌ ఎందుకు ఆస్తులు ప్రకటించడం లేదని ప్రశ్నించారు. జగన్ రాయలసీమ బిడ్డ అయి ఉండి కూడా పట్టిసీమను అడ్డుకుంటున్నారని లోకేష్ విమర్శించారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News