పవన్ లా నమిత రాజకీయ సునామీ సృష్టిస్తుందా..?
రాజకీయాల్లోకి వస్తానని దాదాపు రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది నమిత. తమిళనాట ఆమెకి పిచ్చ పాపులారిటీ ఉంది. కొన్ని మారుమూల ఊళ్లలో బొద్దుగుమ్మ నమితకు గోపురాలు కూడా కట్టారు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ పాలిటిక్స్ లో ఓ వెలుగు వెలగాలని నమిత భావించింది. అయితే ఏ పార్టీలో చేరాలనే అంశం దగ్గర మాత్రం చాన్నాళ్లు ఆగిపోయింది. ఆమె కోసం అన్నాడీఎంకే, డీఎంకే లాంటి లోకల్ పార్టీలు బాగానే ప్రయత్నించాయి. కానీ నమిత మాత్రం బీజేపీలో చేరాలని […]
Advertisement
రాజకీయాల్లోకి వస్తానని దాదాపు రెండేళ్లుగా ఊరిస్తూ వచ్చింది నమిత. తమిళనాట ఆమెకి పిచ్చ పాపులారిటీ ఉంది. కొన్ని మారుమూల ఊళ్లలో బొద్దుగుమ్మ నమితకు గోపురాలు కూడా కట్టారు. ఆ క్రేజ్ ను క్యాష్ చేసుకుంటూ పాలిటిక్స్ లో ఓ వెలుగు వెలగాలని నమిత భావించింది. అయితే ఏ పార్టీలో చేరాలనే అంశం దగ్గర మాత్రం చాన్నాళ్లు ఆగిపోయింది. ఆమె కోసం అన్నాడీఎంకే, డీఎంకే లాంటి లోకల్ పార్టీలు బాగానే ప్రయత్నించాయి. కానీ నమిత మాత్రం బీజేపీలో చేరాలని అప్పట్లో గట్టిగా భావించారు. కుదిరితే నరేంద్ర మోదీ సమక్షంలో కమల తీర్థం పుచ్చుకోవాలని అనుకున్నారు.
కానీ తమిళనాట బీజేపీకి ప్రాభావం చాలా తక్కువ. జయలలిత పార్టీ లేదా కరుణానిథి పార్టీకే అక్కడ ఆదరణ. ఈ రెండూ కాకుండా తాజాగా ఎన్నికల వేళ… విజయకాంత్ నేతృత్వంలో ఓ తృతీయ కూటమి కూడా వచ్చి చేరింది. సో… ఈ 3 పార్టీల్లో ఏదో ఒక పార్టీలో చేరాలని, అయితే ఏ పార్టీ టిక్కెట్ ఇస్తే ఆ పార్టీలోనే చేరాలని నమిత భావించారు. మొన్నటివరకు అలాగే వెయిట్ చేశారు. కానీ తమిళనాడులో టిక్కెట్ దక్కించుకోవడం అంటే ఆషామాషీ వ్యవహారం కాదు.
ఇప్పటికే కరుణానిథి,జయలలిత చాలామంది పేర్లు ప్రకటించి మళ్లీ మార్చేశారు. గట్టిపోటీలో టిక్కెట్టు పొందడం కష్టమని నమితకు అర్థమైపోయింది. అందుకే తనకంటూ సొంతంగా ఓ సర్వే చేయించుకున్నారు. ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయో లెక్కగట్టారు. అలా ఎన్నో విశ్లేషణలు, మరెన్నో వ్యూహాల మధ్య జయలలిత సమక్షంలో అన్నాడీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. తమిళనాడు ఎన్నికల్లో జయ పార్టీకి నమిత ప్రచారం కల్పించనున్నారు. ఏపీ ఎన్నికల్లో సడెన్ గా తెరపైకొచ్చిన పవన్ కల్యాణ్… టీడీపీ-బీజేపీని ఎలా గెలిపించారో… నమిత కూడా అన్నాడీఎంకేను అలా ఒడ్డున పడేస్తుందని కార్యకర్తలు భారీ ఆశలు పెట్టుకున్నారు.
Advertisement