సినిమా ఫ్లాప్ అయింది... వసూళ్లలో అదరగొడుతోంది...

వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో బన్నీ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి.  ఆ అంచనాలకు తగ్గట్టే మొదటిరోజు థియేటర్ల ముందు జనాలు బారులుతీరారు. తీరా థియేటర్లలో బొమ్మ పడేసరికి అది మెగా సినిమా కాదు నందమూరి సినిమా అని అందరికీ అర్థమైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ ప్రారంభమైంది.  సర్దార్ సినిమా టైపులోనే అక్కడక్కడ మెరుపులు ఉన్నప్పటికీ…. మితిమీరిన హింసను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా బన్నీ నుంచి […]

Advertisement
Update:2016-04-25 04:52 IST
వరుస విజయాల తర్వాత వస్తున్న సినిమా కావడంతో బన్నీ మూవీపై అంచనాలు భారీగా పెరిగాయి. ఆ అంచనాలకు తగ్గట్టే మొదటిరోజు థియేటర్ల ముందు జనాలు బారులుతీరారు. తీరా థియేటర్లలో బొమ్మ పడేసరికి అది మెగా సినిమా కాదు నందమూరి సినిమా అని అందరికీ అర్థమైంది. మొదటి రోజు మొదటి ఆట నుంచే నెగెటివ్ టాక్ ప్రారంభమైంది. సర్దార్ సినిమా టైపులోనే అక్కడక్కడ మెరుపులు ఉన్నప్పటికీ…. మితిమీరిన హింసను మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోయారు. మరీ ముఖ్యంగా బన్నీ నుంచి ఊహించిన చమ్మక్కులు లేకపోయేసరికి అంతా డిసప్పాయింట్ అయ్యారు.
అలా నెగెటివ్ టాక్ తో సరైనోడు ప్రయాణం ప్రారంభమైంది. అయితే ఇన్ని ప్రతికూలతల మధ్య కాస్త తెరిపినిచ్చే అంశం ఒకటుంది. అదే వసూళ్లు. అవును… తొలిరోజు సరైనోడు సినిమా కలెక్షన్లలో దుమ్ముదులిపింది. బన్నీకెరీర్ లోనే అత్యధికవసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది. అటు బోయపాటికి కూడా కెరీర్ బెస్ట్ ఓపెనింగ్స్ అందించింది సరైనోడు సినిమా. ఓవరాల్ గా ఏపీ, నైజాంలో కలుపుకొని 10కోట్ల 72లక్షల రూపాయల వసూళ్లు సాధించింది సరైనోడు సినిమా. కచ్చితంగా ఇది డీసెంట్ ఫిగరే. ఇదే ఊపు వీకెండ్ మొత్తం కొనసాగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే… మార్కెట్ లో సరైనోడుకు పోటీగా సిసలైన సినిమా ఇంకోటి లేదు.
పైగా వేసవి సెలవులు కావడంతో జనాలు బన్నీ సినిమాకే ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అన్నీ బాగున్నాయి కానీ, ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సరైనోడు సినిమా సోమవారం నుంచి ఎలా ఆడుతుందనేదే పెద్ద ప్రశ్న. సోమవారం నుంచి శుక్రవారం వరకు వచ్చేవసూళ్ల పైనే ఈ సినిమా భవితవ్యం ఆధారపడి ఉంది
Tags:    
Advertisement

Similar News