ఫిరాయింపు ఎమ్మెల్యే బతుకు ఇంత దారుణంగా ఉందా?

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి తీవ్ర అవమానం జరిగింది.  టీడీపీకి చెందిన సర్పంచ్ సాయికృష్ణ… ఎమ్మెల్యే మణిగాంధీని తీవ్రస్థాయిలో దూషించారు.  రూ. 7కోట్లకు అమ్ముడుపోయి పార్టీ చేరిన నీవా మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు.ఏకంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు  దీంతో మణిగాంధీ బిత్తరపోయారు. చివరకు ఎస్పీకి ఫోన్ చేసి భద్రత కల్పించుకున్నారు.  కర్నూలు మండల సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఎంఈఓ మాట్లాడుతుండగా పాఠశాలల్లో టాయ్‌లెట్లు సరిగా లేవని అనేక సమస్యలున్నాయంటూ […]

Advertisement
Update:2016-04-24 04:01 IST

వైసీపీ నుంచి టీడీపీలో చేరిన ఎమ్మెల్యే కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీకి తీవ్ర అవమానం జరిగింది. టీడీపీకి చెందిన సర్పంచ్ సాయికృష్ణ… ఎమ్మెల్యే మణిగాంధీని తీవ్రస్థాయిలో దూషించారు. రూ. 7కోట్లకు అమ్ముడుపోయి పార్టీ చేరిన నీవా మాట్లాడేది అంటూ విరుచుకుపడ్డారు.ఏకంగా దాడి చేసేందుకు ప్రయత్నించారు దీంతో మణిగాంధీ బిత్తరపోయారు. చివరకు ఎస్పీకి ఫోన్ చేసి భద్రత కల్పించుకున్నారు.

కర్నూలు మండల సర్వసభ్య సమావేశంలో ఈ ఘటన జరిగింది. ఎంఈఓ మాట్లాడుతుండగా పాఠశాలల్లో టాయ్‌లెట్లు సరిగా లేవని అనేక సమస్యలున్నాయంటూ ఎమ్మెల్యే మణిగాంధీ అడ్డుపడ్డారు. దీంతో అక్కడే ఉన్న కోడుమూరు నియోజకవర్గ టీడీపీ ఇన్‌చార్జి విష్ణువర్దన్‌రెడ్డి అనుచరుడు, ఆర్.కొంతలపాడు సర్పంచ్ సాయికృష్ణ ఒక్కసారిగా ఫైర్ అయ్యారు.

‘‘చంద్రబాబుకు అమ్ముడుపోయిన డబ్బుతో మరుగుదొడ్లు కట్టించురా… ఇక్కడ మా నేత(విష్ణువర్దన్ రెడ్డి) చెప్పిందే వేదం. నువ్వేంది మాట్లాడేది. నిన్ను చంపితే తప్ప కోడుమూరు నియోజకవర్గం బాగుపడదు. నువ్వు కేవలం ఎమ్మెల్యేవే. మా నేత ఇన్‌చార్జి. ఆయన మాటే అధికారులు వింటారు’’ అంటూ ఆగ్రహంతో ఊగిపోయారు. నిన్ను చంపితే గానీ కోడుమూరు నియోజకవర్గం బాగుపడుతూ అంటూ దాడి చేసేందుకు దూసుకెళ్లారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యే మణిగాంధీ వణికిపోయారు. టీడీపీనేతలే తిరగబడే సరికి ఏం చేయాలో దిక్కుతోచక ఎస్పీకి ఫోన్‌ చేశారు. రక్షణ కల్పించాలని కోరారు. ఎస్పీ ఆదేశాలతో అక్కడికి చేరుకున్న సీఐ ములకన్న… సర్పంచ్‌ను సమావేశం నుంచి బయటకు పంపించివేశారు. జరిగిన ఘటనలో బిత్తరపోయిన ఎమ్మెల్యే కూడా సమావేశం ముగియకముందే అక్కడి నుంచి జారుకున్నారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News