సుప్రీమ్ విడుదల కూడా అప్పుడే....
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సాయిధర్మతేజ హీరోగా నటించిన చిత్రం సుప్రీమ్. ఈ సినిమాను మే మొదటివారంలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే సుప్రీమ్ పాటల్ని గ్రాండ్ గా విడుదల చేశారు. సాయికార్తీక్ అందించిన ట్యూన్స్ అందరికీ నచ్చాయి. మరీ ముఖ్యంగా ఆడియో ఫంక్షన్ లో విడుదల చేసిన ట్రయిలర్ అందరికీ బాగా నచ్చింది. రాశిఖన్నా అందాలు, సాయిధర్మతేజ మేనరిజమ్స్ తో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. దీంతో వీలైనంత తొందరగా […]
Advertisement
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణ సారథ్యంలో సాయిధర్మతేజ హీరోగా నటించిన చిత్రం సుప్రీమ్. ఈ సినిమాను మే మొదటివారంలో విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు. ఇటీవలే సుప్రీమ్ పాటల్ని గ్రాండ్ గా విడుదల చేశారు. సాయికార్తీక్ అందించిన ట్యూన్స్ అందరికీ నచ్చాయి. మరీ ముఖ్యంగా ఆడియో ఫంక్షన్ లో విడుదల చేసిన ట్రయిలర్ అందరికీ బాగా నచ్చింది. రాశిఖన్నా అందాలు, సాయిధర్మతేజ మేనరిజమ్స్ తో యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.
దీంతో వీలైనంత తొందరగా సినిమాను విడుదల చేయాలనే ఉద్దేశంతో… మే మొదటివారాన్ని ఫిక్స్ చేశారు. అన్నీ అనుకున్నట్టు జరిగితే మే 6న సుప్రీమ్ సినిమా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. అయితే అదే సమయానికి సూర్య నటించిన 24 సినిమా కూడా విడుదలకానుంది. సో… మే 6న 24 సినిమాతో పాటు సుప్రీమ్ కూడా థియేటర్లలోకి వచ్చే అవకాశముంది. పటాస్ సినిమాతో దర్శకుడిగా పరిచయమైన అనిల్ రావిపూడి, తన రెండో ప్రయత్నంగా సుప్రీమ్ ను తెరకెక్కించాడు. అటు సాయిధర్మతేజ కూడా సుబ్రమణ్యం ఫర్ సేల్, పిల్లా నువ్వు లేని జీవితం సినిమాలతో మంచి పేరు తెచ్చుకున్నాడు. అందుకే సుప్రీమ్ సినిమాపై అంచనాలు ఓ మోస్తరుగా పెరిగాయి. అయితే సూర్య నటించిన 24 సినిమాను ఇది ఏ మేరకు అడ్డుకుంటుందనేదే చూడాలి.
Advertisement