మద్యపానం నిషేధం… ఆ జంటకు మంచిరోజులు తెచ్చింది!
మద్యపానం కాపురాలను కూల్చేయడం, జీవితాలను కష్టాలపాలు చేయడం మనకు తెలుసు. అలాంటపుడు ఆల్కహాల్ మీద నిషేధం విధిస్తే అందుకు పూర్తి వ్యతిరేకంగా కాపురాలు నిలబడాలి…జీవితాలు ఆనందయయం కావాలి. బీహార్లో ఓ జంట విషయంలో అలాగే జరిగింది. భర్త తాగుడు అలవాటుని భరించలేక పదమూడేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన ఒక భార్య తిరిగి తన భర్తని, ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా మొదలుపెట్టిన ప్రయత్నాలు ఈ నెల మొదటి […]
మద్యపానం కాపురాలను కూల్చేయడం, జీవితాలను కష్టాలపాలు చేయడం మనకు తెలుసు. అలాంటపుడు ఆల్కహాల్ మీద నిషేధం విధిస్తే అందుకు పూర్తి వ్యతిరేకంగా కాపురాలు నిలబడాలి…జీవితాలు ఆనందయయం కావాలి. బీహార్లో ఓ జంట విషయంలో అలాగే జరిగింది. భర్త తాగుడు అలవాటుని భరించలేక పదమూడేళ్ల క్రితం ఇంట్లోంచి వెళ్లిపోయిన ఒక భార్య తిరిగి తన భర్తని, ఇంటిని వెతుక్కుంటూ వచ్చింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సంపూర్ణ మద్యపాన నిషేధం దిశగా మొదలుపెట్టిన ప్రయత్నాలు ఈ నెల మొదటి తారీకున ప్రారంభమైన నేపథ్యంలో అప్పుడే దాని ఫలితాలు కళ్లముందుకు వస్తున్నాయి.
ఇరవై సంవత్సరాల క్రితం పెళ్లయిన వైజయంతి అనే మహిళ పదమూడేళ్ల క్రితం తన సంవత్సరం కూతురిని తీసుకుని ఇంట్లోంచి బయటకు వెళ్లిపోయింది. వైజయంతి భర్త జై గోవింద్ విపరీతంగా తాగటంతో పాటు తిట్టడం, కొట్టడం చేసేవాడు. అతనిలో మార్పు రాకపోవడంతో ఆమె ఆ పనిచేసింది. నితీష్‌కుమార్ నిర్ణయంతో గోవింద్‌లో మార్పు వచ్చింది. ముఖ్యమంత్రి నిర్ణయాన్ని స్ఫూర్తిగా తీసుకుని తానుకూడా తాగుడు అలవాటు మానేయాలని నిర్ణయించుకున్నాడు. అంతే …భార్యకు క్షమాపణ చెప్పటంతో పాటు ఇంకెప్పుడూ తాగనని, ఆమెను తిట్టనని, కొట్టనని మాట కూడా ఇచ్చాడు. ఈ సంతోష సమయాన్ని వారి కుమార్తె మరింత ఆనందదాయకంగా మారుస్తూ తల్లిదండ్రులు దండలు మార్చుకుని తిరిగి పెళ్లి చేసుకునే ఏర్పాటు చేసింది. తాను పుట్టినప్పటినుండీ తల్లిదండ్రులు దూరంగా ఉండటాన్నే చూసిన ఆ బాలిక ఇప్పుడు ఎంతో సంతోషంగా ఉంది. బీహార్ గ్రామాల్లో మద్యపానం అలవాటు మరింతగా ఎక్కువగా ఉంది. అక్కడ ఆడామగా తేడా లేకుండా తాగుడుకి బానిసలవుతున్నారు. మరో ఆరునెలల్లో పూర్తిస్థాయి మద్య నిషేధం అమల్లోకి రానున్న నేపథ్యంలో సమాజంలో చాలా మార్పు వస్తుందనే ఆశాభావం ఆ రాష్ట్రంలో కనబడుతోంది.