కూర‌గాయ‌ల‌తో... క్రియేటివిటీ!

మ‌నం రోజూ చూసే, తినే కూర‌గాయలు, ప‌ళ్లలో ఇంత గొప్ప‌చిత్ర‌క‌ళ దాగి ఉందా…అనిపించేలా చేశారు శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన గ్రెట్చ‌న్ రొహెర్స్‌, బోస్ట‌న్‌లో ఫ్యాష‌న్ చిత్రాలు గీసే మెరిడిత్ వింగ్ అనే అమ్మాయిలు. ఇద్ద‌రూ చిత్ర‌కారిణులే. అయితే అంద‌రికీ తెలిసిన చిత్ర‌క‌ళకు భిన్నంగా స‌రికొత్త గా కూర‌గాయ‌ల‌తో చిత్రాలూ రూపొందిస్తున్నారు వీరు. ఇన్‌స్టాగ్రామ్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో వీరు షేర్ చేసే చిత్రాలు… ఎవ‌రినైనా వావ్‌…అనిపించ‌క మాన‌వు. ప్ర‌తిరోజు కుప్ప‌లుతెప్ప‌లుగా అభినంద‌న‌లు అందుకుంటున్న వీరు ఇన్‌స్టాగ్రామ్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు. […]

Advertisement
Update:2016-04-21 06:30 IST

మ‌నం రోజూ చూసే, తినే కూర‌గాయలు, ప‌ళ్లలో ఇంత గొప్ప‌చిత్ర‌క‌ళ దాగి ఉందా…అనిపించేలా చేశారు శాన్‌ఫ్రాన్సిస్కోకి చెందిన గ్రెట్చ‌న్ రొహెర్స్‌, బోస్ట‌న్‌లో ఫ్యాష‌న్ చిత్రాలు గీసే మెరిడిత్ వింగ్ అనే అమ్మాయిలు. ఇద్ద‌రూ చిత్ర‌కారిణులే. అయితే అంద‌రికీ తెలిసిన చిత్ర‌క‌ళకు భిన్నంగా స‌రికొత్త గా కూర‌గాయ‌ల‌తో చిత్రాలూ రూపొందిస్తున్నారు వీరు. ఇన్‌స్టాగ్రామ్ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో వీరు షేర్ చేసే చిత్రాలు… ఎవ‌రినైనా వావ్‌…అనిపించ‌క మాన‌వు. ప్ర‌తిరోజు కుప్ప‌లుతెప్ప‌లుగా అభినంద‌న‌లు అందుకుంటున్న వీరు ఇన్‌స్టాగ్రామ్‌కి కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నారు.

అంద‌రికీ తినేవిగా క‌నిపించే కూర‌గాయ‌లు, ప‌ళ్లు వీరి కంటికి మాత్రం చాలా భిన్నంగా క‌న‌బ‌డ‌తాయి. క్యాబేజి, క్యాలిఫ్ల‌వ‌ర్‌, మొక్క‌జొన్న కంకి, బీట్రూట్‌, పుట్ట‌గొడుగులు ఇవ‌న్నీ అమ్మాయిలు ధ‌రించే దుస్తుల్లా ఈ ఇద్ద‌రు అమ్మాయిల‌కు క‌నిపించ‌డ‌మే విచిత్రం. వీరు కూడా అదే చెబుతున్నారు. రోజూ ఆఫీస్‌కి వెళ్లి ప‌నిచేయ‌టం, భోజ‌నం చేయ‌డం, గాడ్జెట్స్‌తో స‌మ‌యం గ‌డ‌ప‌టం….ఇదంతా బోర్ అనిపించి ఏదైనా కొత్త‌గా చేయాల‌నిపించింద‌ని, అప్పుడే త‌మ‌కు ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌ని అంటున్నారు. మామూలు కూర‌గాయ‌ల‌ను మ‌నం ఎంత బిన్నంగా చూడ‌గ‌లం… అనేదే ఈ మొత్తం క్రియేటివిటీకి మూలం. మొత్తానికి కూర‌గాయ‌ల‌ను, ప‌ళ్ల‌ను తిన‌డ‌మే కాదు…ఇలా ధ‌రించ‌వ‌చ్చ‌ని వీరు ప్ర‌పంచానికి చాటారు.

Tags:    
Advertisement

Similar News