స్పీకర్ సెక్యూరిటీ అధికారిపై లైంగిక ఆరోపణలు

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి వ్యక్తిగత భద్రతా అధికారిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. స్పీకర్ సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్లు ఒక వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఈ ఘటన జరిగింది. సింగరేణి అధికారి భార్యతో స్పీకర్ సెక్కూరిటీ అధికారి వెంకటేశ్వర్లు అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె భర్త, స్థానికులు అడ్డుకున్నారు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. సాయం కోసం స్పీకర్ దగ్గరకు వచ్చిన మహిళతో వెంకటేశ్వర్లు ఇలా ప్రవర్తించారు.  అయితే పట్టుబడిన […]

Advertisement
Update:2016-04-21 04:47 IST

తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ మధుసూధనాచారి వ్యక్తిగత భద్రతా అధికారిపై లైంగిక ఆరోపణలు వచ్చాయి. స్పీకర్ సెక్యూరిటీ అధికారి వెంకటేశ్వర్లు ఒక వివాహితతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. వరంగల్ జిల్లా భూపాలపల్లిలో ఈ ఘటన జరిగింది. సింగరేణి అధికారి భార్యతో స్పీకర్ సెక్కూరిటీ అధికారి వెంకటేశ్వర్లు అసభ్యకరంగా ప్రవర్తించగా ఆమె భర్త, స్థానికులు అడ్డుకున్నారు. అతడిని చితక్కొట్టి పోలీసులకు అప్పగించారు. సాయం కోసం స్పీకర్ దగ్గరకు వచ్చిన మహిళతో వెంకటేశ్వర్లు ఇలా ప్రవర్తించారు. అయితే పట్టుబడిన వ్యక్తి స్పీకర్ సెక్యూరిటీ అధికారి అని తెలియగానే పరిస్థితి మారిపోయింది. అతడిని పోలీసులు వదిలేశారు. స్పీకర్ కార్యాలయం నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగానే సదరు అధికారిని వదిలేశారని భావిస్తున్నారు. భర్త, గ్రామస్తులు ఆందోళనకు దిగడంతో పోలీసులు వెనక్కు తగ్గి కేసు నమోదు చేశారు. మరోవైపు అధికారి వెంకటేశ్వర్లను ఎస్పీకి స్పీకర్ సరెండర్ చేశారు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News