సర్వే చిత్రాలు… ఆ నలుగురికి వరుస ర్యాంకులు
మంత్రుల పనితీరును బట్టి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు విచిత్రంగానే ఉన్నాయి. అసలు ఈ ర్యాంకుల ప్రతిపాదిక ఏంటో తెలియక అధికార పార్టీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు. పీతల సుజాతకు ఏకంగా మొదటి ర్యాంకు ఇచ్చారు. ఆమె పనితీరు బాగుందని ఒక్కరూ మెచ్చుకోరు కానీ ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ర్యాంకు ఇచ్చే స్థాయిలో ఆమె పనితీరు ఉందా అన్న విమర్శలు వస్తున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. దళిత మంత్రికి పీతల సుజాత తర్వాత వరుసగా ఒకే సామాజికవర్గానికి చెందిన మంత్రులే […]
మంత్రుల పనితీరును బట్టి చంద్రబాబు ఇచ్చిన ర్యాంకులు విచిత్రంగానే ఉన్నాయి. అసలు ఈ ర్యాంకుల ప్రతిపాదిక ఏంటో తెలియక అధికార పార్టీ నేతలు జుట్టుపీక్కుంటున్నారు. పీతల సుజాతకు ఏకంగా మొదటి ర్యాంకు ఇచ్చారు. ఆమె పనితీరు బాగుందని ఒక్కరూ మెచ్చుకోరు కానీ ఇప్పుడు ఏకంగా ఫస్ట్ ర్యాంకు ఇచ్చే స్థాయిలో ఆమె పనితీరు ఉందా అన్న విమర్శలు వస్తున్నాయి. మరో ముఖ్య విషయం ఏమిటంటే.. దళిత మంత్రికి పీతల సుజాత తర్వాత వరుసగా ఒకే సామాజికవర్గానికి చెందిన మంత్రులే టాప్ ర్యాంకుల్లో నిలిచారు. రెండో స్థానంలో దేవినేని ఉమా, మూడో స్థానంలో ప్రత్తిపాటి, నాలుగో స్థానంలో కామినేని శ్రీనివాస్, ఐదో స్థానంలో పరిటాల సునీత. ఈ నలుగురు బాబు సామాజికవర్గం వారే కావడం విశేషం. అంటే పీతల సుజాతను పక్కనపెడితే టాప్ ర్యాంకుల్లో వీరిదే హవా.
ఏపీలో పెద్దెత్తున విమర్శలు ఎదుర్కొంటున్న శాఖల్లో వ్యవసాయం, వైద్య ఆరోగ్యం ఉన్నాయి. కానీ ఆయా శాఖలకు చెందిన ప్రత్తిపాటి, కామినేనికి వరుసగా మూడు నాలుగు ర్యాంకులు కట్టబెట్టారు. సీఎం తర్వాత సీఎం లాంటి వ్యక్తిగా పేరు తెచ్చుకున్న నారాయణకు ఆఖరి స్థానం కట్టబెట్టారు. మాణిక్యాల రావుకు 12 వ ర్యాంకు ఇచ్చారు. మొత్తం మీద ఈ ర్యాంకులను మంత్రులు మీడియాలో చేసే హడావుడి, చంద్రబాబుపై భక్తి ఆధారంగా ఇచ్చినట్టుగా ఉందన్న భావన వ్యక్తమవుతోంది. కేబినెట్‌లో ర్యాంకుల ప్రకటన తర్వాత చాలా మంది మంత్రుల ముఖాలు కళతప్పాయట. అందుకే కాబోలు ఈ ర్యాంకులకు ఎలాంటి ప్రాధాన్యత లేదంటూ వెంటనే చంద్రబాబు అన్నట్టుగా టీడీపీ అనుకూల పత్రిక రాసింది.
Click on Image to Read: