ఆ హీరోయిన్ ను చూసి అవాక్కయ్యారు..!
చాలెంజ్ గా చేసే రోల్స్ ఎప్పుడో ఒకసారి నటీ నటులకు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ల సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంటుంది. తాజాగా ఉడ్తా పంజాబ్ చిత్రంలో హీరోయిన్ అలియ భట్ కు ఆ తరహా గోల్టెన్ చాన్స్ వచ్చింది. ఆ చిత్రంలో ఒక గ్రామీణ బీహారి యువతిలా నటించింది. ఆ పాత్ర కోసం బీహారీ నేర్చుకుంది. అచ్చంగా గ్రామీణ యువతిలా మారింది. కథలో తన క్యారెక్టర్ డిమాండ్ మేరకు ముతక […]
Advertisement
చాలెంజ్ గా చేసే రోల్స్ ఎప్పుడో ఒకసారి నటీ నటులకు వస్తుంటాయి. అలా వచ్చినప్పుడు వాళ్ల సత్తాను నిరూపించుకునే అవకాశం వస్తుంటుంది. తాజాగా ఉడ్తా పంజాబ్ చిత్రంలో హీరోయిన్ అలియ భట్ కు ఆ తరహా గోల్టెన్ చాన్స్ వచ్చింది. ఆ చిత్రంలో ఒక గ్రామీణ బీహారి యువతిలా నటించింది. ఆ పాత్ర కోసం బీహారీ నేర్చుకుంది. అచ్చంగా గ్రామీణ యువతిలా మారింది. కథలో తన క్యారెక్టర్ డిమాండ్ మేరకు ముతక దుస్తులు వేసుకుంది. మాసిన జుత్తు, ముఖం పై గాయాలు.. ఆ పాత్ర గురించి వివరిస్తే..ఇటువంటి కష్టాలు చాలా వుంటాయి. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ సమయంలో తన రోల్ గురించి చెప్పింది. ఈ పాత్రకు తనను ఎంపిక చేయడానికి దర్శకుడు అభిషేక్ పట్టు బట్టారట. ఆ పాత్ర కు తనను సూచించింది ఈ చిత్రంలో హీరో రోల్ చేసిన షాహిద్ కపూరేనట. మొత్తం మీద ఈ పాత్ర ఇంత బాగా వచ్చిందంటే ఇదంతా తన కాస్టూమ్ డిజైనర్, అండ్ డైరెక్టర్ గొప్పతనమేనని చెప్పుకొచ్చింది.ఈ చిత్రం త్వరలో రిలీజ్ కు సిద్దం అవుతుంది.
Advertisement