సర్దార్ తో బేరం పెట్టిన మాటీవి

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో… ఎంత మేర వసూళ్లు సాధిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. బయ్యర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 35 కోట్ల రూపాయల నష్టాలు తెచ్చిపెట్టింది. సర్దార్ ఎఫెక్ట్ ఇప్పుడు శాటిలైట్ హక్కులపై కూడా పడింది. సినిమా సూపర్ హిట్ అయిపోతుందనే అంచనాల మధ్య… సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ మొత్తానికి మాటీవీ కొనుగోలు చేసింది. తీరా సినిమా […]

Advertisement
Update:2016-04-16 13:40 IST
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఏ రేంజ్ లో ఆడుతుందో… ఎంత మేర వసూళ్లు సాధిస్తుందో అందరికీ తెలిసిన విషయమే. బయ్యర్లకు చుక్కలు చూపిస్తున్న ఈ సినిమా ఇప్పటికే దాదాపు 35 కోట్ల రూపాయల నష్టాలు తెచ్చిపెట్టింది. సర్దార్ ఎఫెక్ట్ ఇప్పుడు శాటిలైట్ హక్కులపై కూడా పడింది. సినిమా సూపర్ హిట్ అయిపోతుందనే అంచనాల మధ్య… సర్దార్ గబ్బర్ సింగ్ మూవీని ఏకంగా 13 కోట్ల రూపాయల భారీ మొత్తానికి మాటీవీ కొనుగోలు చేసింది. తీరా సినిమా విడుదలైన తర్వాత రిజల్ట్ చూస్తే చాలా వ్యత్యాసం కనిపించింది. దీంతో మాటీవీ ప్రతినిధులు.. నిర్మాత శరత్ మరార్ తో బేరసారాలకు దిగారట. ఇప్పటికే కుదుర్చుకున్న 13కోట్ల ఒప్పందం ప్రకారం కాకుండా… ఓ 2-3 కోట్లు తగ్గించాలని రిక్వెస్ట్ చేస్తున్నారట. అయితే అధికారికంగా ఒప్పందం కుదరడంతో… శరత్ మరార్ తగ్గడం లేదని సమాచారం. దీనికి బదులుగా పవన్ నెక్ట్స్ సినిమా శాటిలైట్ హక్కుల్ని తక్కువ రేటుకు ఇస్తామని మాటీవీని ఊరిస్తున్నాడట. సో… థియేటర్లలోనే కాకుండా… టీవీల్లో ప్రసారం చేసినా… ఈ సినిమాకు లాభాలు రావనే విషయాన్ని మాటీవీ తొందరగానే గ్రహించింది.
Click on Image to Read:
Tags:    
Advertisement

Similar News