త్రిష కోసం ఆ పనికి ఒప్పుకున్న బాలయ్య....

బాలయ్య ఓ కార్యక్రమానికి హాజరవ్వాలంటే అందులో పొలిటికల్ టచ్ అయినా ఉండాలి… లేదంటే తన ఫ్యామిలీకి సంబంధించినదైనా ఉండాలి. ఈ రెండూ కాకుండా అతడు ఓ కార్యక్రమానికి హాజరయ్యాడంటే అది కచ్చితంగా తన పెద్ద మనసును చాటుకునే సంఘటన అయి ఉండాలి. ఇది ఆ కేటగిరీ వార్తే. నారా రోహిత్ లేదా కల్యాణ్ రామ్ ఫంక్షన్లకు బాలయ్య వస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే త్రిష లాంటి హీరోయిన్ కు సంబంధించిన సినిమా ఫంక్షన్ కు వస్తున్నాడంటే […]

Advertisement
Update:2016-04-13 04:31 IST

బాలయ్య ఓ కార్యక్రమానికి హాజరవ్వాలంటే అందులో పొలిటికల్ టచ్ అయినా ఉండాలి… లేదంటే తన ఫ్యామిలీకి సంబంధించినదైనా ఉండాలి. ఈ రెండూ కాకుండా అతడు ఓ కార్యక్రమానికి హాజరయ్యాడంటే అది కచ్చితంగా తన పెద్ద మనసును చాటుకునే సంఘటన అయి ఉండాలి. ఇది ఆ కేటగిరీ వార్తే. నారా రోహిత్ లేదా కల్యాణ్ రామ్ ఫంక్షన్లకు బాలయ్య వస్తే అందులో ఆశ్చర్యం లేదు. అదే త్రిష లాంటి హీరోయిన్ కు సంబంధించిన సినిమా ఫంక్షన్ కు వస్తున్నాడంటే అది కచ్చితంగా వార్తే. త్రిష లీడ్ రోల్ పోషించిన నాయకి సినిమాను త్వరలోనే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా ఆడియో ఫంక్షన్ ను ఈనెల 19న ప్లాన్ చేశారు. ఈ ఆడియో వేడుకకు ప్రత్యేక అతిథిగా హాజరయ్యేందుకు బాలకృష్ణ అంగీకరించారు. స్వయంగా త్రిష, బాలయ్య ఇంటికెళ్లి రిక్వెస్ట్ చేయడంతో నటసింహం కాదనలేకపోయింది. గతంలో బాలయ్య-త్రిష కాంబినేషన్ లో లయన్ సినిమా వచ్చింది. ఆ సినిమా ఫ్లాప్ అయినా… త్రిష కమిట్ మెంట్, నటన బాలయ్యను ఆకట్టుకున్నాయి. అందుకే ఆమె అడిగినవెంటనే… తనకు సంబంధం లేకపోయినా కార్యక్రమానికి హాజరయ్యేందుకు బాలయ్య అంగీకరించారు.

Tags:    
Advertisement

Similar News