సర్దార్ ప్రచారం మళ్లీ మొదలైంది

సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలై వీకెండ్ కూడా గడిచిపోయింది. అంటే సినిమాను అట్టహాసంగా విడుదల చేసి ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. అయితే పవన్ మాత్రం ఇప్పుడు తాజాగా ప్రమోషన్ షురూ చేశాడు. కొన్ని ముఖ్యమైన పత్రికలు, చానెళ్లకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ప్రచారమే చేయని పవన్… ఇలా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించడం పెద్ద వింతగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే… భారీగా డబ్బులు పెట్టి […]

Advertisement
Update:2016-04-12 05:05 IST
సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలై వీకెండ్ కూడా గడిచిపోయింది. అంటే సినిమాను అట్టహాసంగా విడుదల చేసి ఇప్పటికే 4 రోజులు అయిపోయింది. అయితే పవన్ మాత్రం ఇప్పుడు తాజాగా ప్రమోషన్ షురూ చేశాడు. కొన్ని ముఖ్యమైన పత్రికలు, చానెళ్లకు పిలిచి మరీ ఇంటర్వ్యూ ఇచ్చాడు. అసలు ప్రచారమే చేయని పవన్… ఇలా సర్దార్ గబ్బర్ సింగ్ సినిమాకు రెండో విడత ప్రచారాన్ని ప్రారంభించడం పెద్ద వింతగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఎందుకంటే… భారీగా డబ్బులు పెట్టి తీసిన సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. మొదటి రోజు నుంచే పడిపోయిన ఈ సినిమా వసూళ్ల గ్రాస్ ను తిరిగి కాస్తోకూస్తో లేపాలంటే పవన్ మరోసారి రంగంలోకి దిగాల్సిందే. అందుకే పనిగట్టుకొని మరీ ఇలా ప్రచారాన్ని రెండోసారి ప్రారంభించాడు. అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం… పవన్ మరోసారి ప్రచారం స్టార్ట్ చేసిన పెద్దగా ప్రయోజనం ఉండకపోవచ్చు. ఎందుకంటే… ఇప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. సర్దార్ సినిమా నడుస్తున్న థియేటర్ల వైపు ప్రేక్షకులు రావడం మానేశారు.
Tags:    
Advertisement

Similar News