అమ్మ అధికబరువు... బిడ్డకు పాలు కరువు!
అధికబరువున్న తల్లులు తమ పిల్లలకు సౌకర్యవంతంగా పాలను ఇవ్వలేకపోతున్నారని ఒక ఆస్ట్రేలియా అధ్యయనంలో తేలింది. అధిక బరువుతో సతమతమయ్యే తల్లులు తమ చుట్టు పక్కల ఎవరైనా ఉన్నపుడు బిడ్డకు పాలివ్వడంలో తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, అలాంటపుడు వారు బిడ్డ కడుపు నిండకపోయినా పాలను ఇవ్వడం ఆపేస్తున్నారని ఈ అద్యయనం తేల్చింది. అలాగే ఇలాంటివారు చాలా త్వరగా పిల్లలకు పూర్తిగా పాలు మాన్పించాలని కూడా చూస్తారని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు. లావుగా ఉన్న స్త్రీలు తమ సన్నిహిత […]
అధికబరువున్న తల్లులు తమ పిల్లలకు సౌకర్యవంతంగా పాలను ఇవ్వలేకపోతున్నారని ఒక ఆస్ట్రేలియా అధ్యయనంలో తేలింది. అధిక బరువుతో సతమతమయ్యే తల్లులు తమ చుట్టు పక్కల ఎవరైనా ఉన్నపుడు బిడ్డకు పాలివ్వడంలో తీవ్రమైన అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారని, అలాంటపుడు వారు బిడ్డ కడుపు నిండకపోయినా పాలను ఇవ్వడం ఆపేస్తున్నారని ఈ అద్యయనం తేల్చింది. అలాగే ఇలాంటివారు చాలా త్వరగా పిల్లలకు పూర్తిగా పాలు మాన్పించాలని కూడా చూస్తారని ఈ అధ్యయన నిర్వాహకులు చెబుతున్నారు.
లావుగా ఉన్న స్త్రీలు తమ సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితులు అయిన మహిళల ముందు కూడా సౌకర్యవంతంగా బిడ్డకు పాలు ఇవ్వలేకపోతున్నారని, ఎవరైనా ఉన్నపుడు పాలివ్వాలంటే ఆందోళనగానూ, నచ్చనిపని చేస్తున్నట్టుగానూ ఫీలవుతున్నారని బ్రిస్‌బేన్‌లోని క్వీన్స్‌ల్యాండ్ యూనివర్శిటీకి చెందిన డాక్టర్ రూత్ న్యూబే అంటున్నారు. ఈ అధ్యయన నిర్వహణలో ఆమెకూడా పాలుపంచుకున్నారు. సరిపడా బరువున్న మహిళలతో పోలిస్తే అధిక బరువున్న మహిళలు చాలా త్వరగా తల్లిపాలను ఇవ్వడం మానేస్తున్నారని రూత్ చెబుతున్నారు. బరువున్న మహిళలు పాలు ఇవ్వలేకపోవడం వెనుక ఉన్న శారీరక సమస్యలు, మానసిక ఆటంకాలపై మరిన్ని అధ్యయనాలు నిర్వహించాల్సి ఉందని ఆమె పేర్కొన్నారు.