సర్దార్‌ మూవీ అట్టర్ ప్లాప్‌ అని నేరుగా చెప్పిన ఇద్దరు ప్రముఖులు

పవన్‌ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి అని ఏకంగా పవనిజం అనే ఇజాన్ని సృష్టించిన అభిమానులకు సర్దార్ గబ్బర్‌ సింగ్ గట్టి షాకే ఇచ్చింది. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్‌ను మూటకట్టుకుంది. సినిమాలు అన్నాక హిట్లు ప్లాపులు సహజం. కానీ వరుస హిట్‌లతో దూసుకుపోతున్న పవన్‌పై ఇంతకాలం కాచుకుకూర్చున్న కొందరు ఇప్పుడు చెలరేగిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు. ఈ జాబితాలో ఎప్పటిలాగే వర్మ ముందున్నారు. తాను సాధారణ అభిమానులకంటే పవన్‌కు […]

Advertisement
Update:2016-04-08 13:07 IST

పవన్‌ అంటే ఒక వ్యక్తి కాదు. ఒక శక్తి అని ఏకంగా పవనిజం అనే ఇజాన్ని సృష్టించిన అభిమానులకు సర్దార్ గబ్బర్‌ సింగ్ గట్టి షాకే ఇచ్చింది. ఫస్ట్ షో నుంచే నెగిటివ్ టాక్‌ను మూటకట్టుకుంది. సినిమాలు అన్నాక హిట్లు ప్లాపులు సహజం. కానీ వరుస హిట్‌లతో దూసుకుపోతున్న పవన్‌పై ఇంతకాలం కాచుకుకూర్చున్న కొందరు ఇప్పుడు చెలరేగిపోయి కామెంట్స్ చేస్తున్నారు. సలహాలు కూడా ఇచ్చేస్తున్నారు.

ఈ జాబితాలో ఎప్పటిలాగే వర్మ ముందున్నారు. తాను సాధారణ అభిమానులకంటే పవన్‌కు పెద్ద అభిమానినని చెబుతూనే సెటైర్లు వేశారు. ఇప్పటికైనా కళ్లు తెరవండి పవన్ అంటూ సలహా ఇచ్చారు. తాను నెల రోజుల క్రితం ఏం చెప్పానో ఇప్పుడు అదే జరిగిందని ట్విట్టర్‌లో గెలికాడు.

హిందీలో సర్దార్ కలెక్షన్లు రెండు శాతమేనని ఇది తాను నెల రోజుల క్రితమే ఊహించానని చెప్పారు. పవన్ తన సినిమాను హిందీలో విడుదల చేయడం వల్ల పవన్ కన్నా ప్రభాసే పెద్ద హీరోగా గుర్తింపు తెచ్చుకుంటారని నెల క్రితమే వర్మ ట్వీట్ చేశారు. బాహుబలిని మించిన సినిమాతోనే బాలీవుడ్‌లోని పవన్ ఎంటర్ అవ్వాలని డబ్బింగ్ సినిమాతో కాదని అప్పటే సలహా ఇచ్చానని చెప్పారు వర్మ. ఇప్పటికైనా పవన్ తన చుట్టూ ఉన్న వారి చెడు సలహాలను వినడం మానేయాలని వర్మ సూచించారు.

ప్రముఖ బాలీవుడ్ విశ్లేషకుడు కమాల్ ఆర్ ఖాన్ మరీ దారుణంగా పవన్ గురించి కామెంట్ చేశారు. సర్దార్ సినిమా హిందీలోనే కాదు తెలుగులోనూ బిగెస్ట్ ప్లాప్ అన్న రివ్య్యూలు అందుతున్నాయని కమాల్ ట్వీట్ చేశారు. అంతేకాదు ” పవన్ సార్ మీ సర్దార్ గబ్బర్ సింగ్ బిగెస్ట్ ప్లాప్. మీరు ఇప్పుడు రెండు రూపాయల స్టార్. కాబట్టి నా దేశ్‌ ద్రోహి 2 సినిమాలో నటించి తిరిగి సూపర్ స్టార్‌గా ఎదగండి” అని ఎద్దేవా చేశారు. మొత్తానికి సర్దార్ మూవీ విషయంలో వస్తున్న నెగిటివ్ టాక్ పవన్ అభిమానులకు ఏమాత్రం రుచించడం లేదు.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News