రాజ్యసభకు ఎంత బలం కావాలి… టీడీపీకి మూడు ఖాయమా?

వైసీపీ ఎమ్మెల్యేలను భారీ ఆఫర్లు ఇచ్చి టీడీపీ కొనుగోలు చేయడం వెనుక రాజ్యసభ సీట్ల గెలుపు కూడా ముఖ్య కారణం. జూన్‌లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నిర్మల సీతారామన్‌,  సుజనా చౌదరి, జైరాం రమేష్,  జేడీ శీలం ఉన్నారు. ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు టీడీపీ, వైసీపీకే దక్కనున్నాయి. ఒక రాజ్యసభ సీట్లు గెలవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం.  ప్రస్తుతం వైసీపీకి 67 మంది సభ్యులున్నారు. అంటే […]

Advertisement
Update:2016-04-06 05:00 IST

వైసీపీ ఎమ్మెల్యేలను భారీ ఆఫర్లు ఇచ్చి టీడీపీ కొనుగోలు చేయడం వెనుక రాజ్యసభ సీట్ల గెలుపు కూడా ముఖ్య కారణం. జూన్‌లో ఏపీ నుంచి నాలుగు రాజ్యసభ సీట్లు ఖాళీ అవుతున్నాయి. అందులో నిర్మల సీతారామన్‌, సుజనా చౌదరి, జైరాం రమేష్, జేడీ శీలం ఉన్నారు. ఈ నాలుగు స్థానాలు ఇప్పుడు టీడీపీ, వైసీపీకే దక్కనున్నాయి. ఒక రాజ్యసభ సీట్లు గెలవాలంటే కనీసం 41 మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం వైసీపీకి 67 మంది సభ్యులున్నారు. అంటే ఒక స్థానాన్ని సులువుగా గెలుచుకోనుంది. అయితే …

మిగిలిన మూడు స్థానాలను టీడీపీ నేరుగా గెలుచుకోవాలంటే 123 మంది సభ్యుల మద్దతు అవసరం. కానీ టీడీపీకి ప్రస్తుతం బీజేపీ సభ్యులతో కలిపితే 106 మంది సభ్యుల మద్దతు ఉంది. ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరిన, చేరబోతున్న జ్యోతుల, సుబ్బారావు, సునీల్‌ లను కలుపుకుంటే టీడీపీ బలం 117కు చేరింది. అంటే తొలి ప్రాధాన్యత ఓటుతోనే టీడీపీ మూడు రాజ్యసభ స్థానాలను గెలుచుకోవాలంటే మరో ఐదుగురు ఎమ్మెల్యేలు అవసరం. కాబట్టి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే లోపు మరో ఐదుగురు వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి రప్పించుకోవాలని భావిస్తోంది.

టీడీపీ అధినాయకత్వం టార్గెట్ కూడా ఇదేనని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ఒక వేళ టీడీపీ చెప్పినట్టు మూడు స్థానాలు సులువుగా నేరుగా గెలుచుకునేందుకు మరో ఐదుగురు ఎమ్మెల్యేలను తీసుకున్నా వైసీపీ బలం 51గా ఉంటుంది. కాబట్టి వైసీపీ ఒక స్థానం గెలుచుకోవడానికి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు. వైసీపీకి భారీగా మిగులు ఓట్లు ఉండకుండా చూడడమే టీడీపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే రాజ్యసభ సీటు వందల కోట్ల విలువ చేస్తున్న ప్రస్తుత నేపథ్యంలో డబ్బున్న పారిశ్రామికవేత్తలను టీడీపీ రంగంలోకి దింపి మరింత మందిని లాగే ప్రయత్నం చేస్తుందా అన్న భావన కూడా ఉంది.

Click on Image to Read:

Tags:    
Advertisement

Similar News