బ్రస్సెల్స్ లో బాహుబలి హంగామా

ఈమధ్య ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బ్రస్సెల్స్ నగరం. బెల్జియం రాజధానిగా, యూరోప్ లో అతిపెద్ద వాణిజ్య రాజధానిగా పేరుకున్న బ్రస్సెల్స్ లో విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో 32 మంది మరణించారు. అలా ప్రపంచం మొత్తం బ్రస్సెల్స్ వైపు చూసింది. అదంతా గతం. తాజాగా ఆ విమానాశ్రయాన్ని కూడా తిరిగి ప్రారంభించారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని బ్రస్సెల్స్ సిటీ మరోసారి ఎట్రాక్ట్ చేసింది. ఈసారి బ్రస్సెల్స్ లో బాహుబలి హంగామా సృష్టించాడు. నగరంలో […]

Advertisement
Update:2016-04-06 04:54 IST

ఈమధ్య ఒక్కసారిగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది బ్రస్సెల్స్ నగరం. బెల్జియం రాజధానిగా, యూరోప్ లో అతిపెద్ద వాణిజ్య రాజధానిగా పేరుకున్న బ్రస్సెల్స్ లో విమానాశ్రయంపై ఉగ్రవాదులు దాడిచేశారు. ఈ ఘటనలో 32 మంది మరణించారు. అలా ప్రపంచం మొత్తం బ్రస్సెల్స్ వైపు చూసింది. అదంతా గతం. తాజాగా ఆ విమానాశ్రయాన్ని కూడా తిరిగి ప్రారంభించారు. అయితే ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్ని బ్రస్సెల్స్ సిటీ మరోసారి ఎట్రాక్ట్ చేసింది. ఈసారి బ్రస్సెల్స్ లో బాహుబలి హంగామా సృష్టించాడు. నగరంలో జరుగుతున్న ఇంటర్నేషనల్ ఫెంటాస్టిక్ ఫిలింఫెస్టివల్ లో భాగంగా బాహుబలి చిత్రాన్ని ప్రదర్శించారు. భాషతో సంబంధం లేకుండా చాలాదేశాలకు చెందిన విశ్లేషకులు, ప్రేక్షకులు ఈ సినిమాను ఆసాంతం ఎంజాయ్ చేశారు. గ్రాఫిక్స్ ను ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మరో వారం రోజుల్లో ఈ చిత్రోత్సవానికి సంబంధించిన అవార్డుల్ని ప్రకటిస్తారు. అక్కడ కూడా బాహుబలికి ఏదో ఒక అవార్డు వరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Tags:    
Advertisement

Similar News