ఇకపై ఫోన్‌లో వేధించినా...నిర్భ‌య‌చ‌ట్టం!

బ‌స్టాపులు, కాలేజీలు, రోడ్లు…ఇవ‌న్నీ దాటిపోయి ఇప్పుడు ఫోన్లు, ఫేస్‌బుక్‌ల్లో కూడా ఆడ‌వాళ్ల‌పై వేధింపులు పెరిగిపోయాయి. ఎలాగోలా ఫోన్ నెంబ‌ర్ల‌ను సంపాదించి అస‌భ్యంగా మాట్లాడుతూ, విసిగించే, వేధించే పోకిరీలు, ఆక‌తాయిలు ఎక్కువై పోయారు. అందుకే అలాంటివారిపై కూడా ఇక‌పై నిర్భ‌య చట్టాన్ని ప్ర‌యోగించాల‌ని హైద‌రాబాద్ పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డితే ఐటి చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసేవారు. పోకిరీలు తెలిసిన మ‌హిళ‌ల‌నే కాకుండా, త‌మ‌కు ఏదోవిధంగా తార‌స‌ప‌డిన ఫోన్‌నెంబ‌ర్లు మ‌హిళ‌ల‌వ‌యితే చాలు, వారిని కూడా వేధిస్తున్నారు. మ‌హిళా డాక్ట‌ర్లు, బ్యూటీపార్ల‌ర్ల సిబ్బంది ఈ […]

Advertisement
Update:2016-04-03 06:39 IST

బ‌స్టాపులు, కాలేజీలు, రోడ్లు…ఇవ‌న్నీ దాటిపోయి ఇప్పుడు ఫోన్లు, ఫేస్‌బుక్‌ల్లో కూడా ఆడ‌వాళ్ల‌పై వేధింపులు పెరిగిపోయాయి. ఎలాగోలా ఫోన్ నెంబ‌ర్ల‌ను సంపాదించి అస‌భ్యంగా మాట్లాడుతూ, విసిగించే, వేధించే పోకిరీలు, ఆక‌తాయిలు ఎక్కువై పోయారు. అందుకే అలాంటివారిపై కూడా ఇక‌పై నిర్భ‌య చట్టాన్ని ప్ర‌యోగించాల‌ని హైద‌రాబాద్ పోలీసులు నిర్ణ‌యం తీసుకున్నారు. గ‌తంలో ఇలాంటి నేరాల‌కు పాల్ప‌డితే ఐటి చ‌ట్టం కింద కేసు న‌మోదు చేసేవారు. పోకిరీలు తెలిసిన మ‌హిళ‌ల‌నే కాకుండా, త‌మ‌కు ఏదోవిధంగా తార‌స‌ప‌డిన ఫోన్‌నెంబ‌ర్లు మ‌హిళ‌ల‌వ‌యితే చాలు, వారిని కూడా వేధిస్తున్నారు. మ‌హిళా డాక్ట‌ర్లు, బ్యూటీపార్ల‌ర్ల సిబ్బంది ఈ విధంగా ఆక‌తాయిల బారిన ప‌డుతున్నారు.

ప్ర‌క‌ట‌న‌లు, ఆసుప‌త్రులు, త‌దిత‌ర మార్గాల ద్వారా వాణిజ్య ప్రాతిప‌దిక‌పై వెల్ల‌డ‌య్యే ఫోన్ నెంబ‌ర్ల‌ను వీరు సంపాదిస్తున్నారు. ఫోన్‌ కాల్సే కాదు, వాట్సప్ ల ద్వారా అశ్లీల వీడియోలు, చిత్రాలు కూడా పంపుతున్నారు. మ‌హిళా డాక్ట‌ర్లు, బ్యూటీషియ‌న్ల నుండి పోలీసుల‌కు ప‌లు పిర్యాదులు అందుతున్న నేప‌థ్యంలో పోలీసులు ఈ విష‌యాన్ని సీరియ‌స్‌గా తీసుకున్నారు. ఫోన్లో అసభ్యంగా మాట్లాడటం, వేధించడం సైతం ఐపీసీ 354(డి) పరిధిలోకి వస్తుందని న్యాయ‌నిపుణులు స‌ల‌హా ఇవ్వ‌డంతో ఈ నేరగాళ్లపై నిర్భయ చట్టం కింద కేసులు నమోదు చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. వేధింపుల‌కు గుర‌యిన ‌సంద‌ర్భాల్లో మ‌హిళ‌లు, విద్యార్థినులు షి టీములకు ధైర్యంగా ఫోను చేయాల‌ని, వివ‌రాలు గోప్యంగా ఉంచుతామ‌ని పోలీసు అధికారులు వెల్ల‌డిస్తున్నారు. నిర్భ‌య చ‌ట్టం ప్ర‌యోగిస్తే బెయిల్ రాదు క‌నుక‌, జైలు శిక్ష‌తో మ‌హిళ‌లను వేధించే వారిలో మార్పు వ‌స్తుంద‌ని పోలీసులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News