ఈ ప్లానింగ్ లో ఏదో మతలబు ఉంది గురూ...

సినిమాకు ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు పాటలు విడుదల చేస్తాం. గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేసి కుదిరితే అదే ఫంక్షన్ లో థియేట్రికల్ ట్రయిలర్ కూడా దించేస్తాం. ఆ తర్వాత దశల వారీగా సాంగ్ బిట్స్ వచ్చేస్తాయి. కాస్త డబ్బులుంటే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తాం. ఆ తర్వాత నటీనటులతో ఇంటర్వ్యూలు… ఆ తర్వాత బొమ్మ తెరపై పడుతుంది. ఇలా ఉంటుంది ప్రచారం ఎప్పుడైనా… ఎక్కడైనా. కానీ బన్నీ మాత్రం ప్రమోషన్ యాంగిల్స్ మార్చేస్తున్నాడు. సరైనోడు […]

Advertisement
Update:2016-04-02 07:35 IST
సినిమాకు ప్రమోషన్ ఇవ్వాలంటే ముందు పాటలు విడుదల చేస్తాం. గ్రాండ్ గా ఆడియో రిలీజ్ చేసి కుదిరితే అదే ఫంక్షన్ లో థియేట్రికల్ ట్రయిలర్ కూడా దించేస్తాం. ఆ తర్వాత దశల వారీగా సాంగ్ బిట్స్ వచ్చేస్తాయి. కాస్త డబ్బులుంటే ట్రిపుల్ ప్లాటినం డిస్క్ ఫంక్షన్ చేస్తాం. ఆ తర్వాత నటీనటులతో ఇంటర్వ్యూలు… ఆ తర్వాత బొమ్మ తెరపై పడుతుంది. ఇలా ఉంటుంది ప్రచారం ఎప్పుడైనా… ఎక్కడైనా. కానీ బన్నీ మాత్రం ప్రమోషన్ యాంగిల్స్ మార్చేస్తున్నాడు. సరైనోడు సినిమాలో సిసలైన చిత్రాలు చూపిస్తున్నాడు. వస్తూనే డిఫరెంట్ గా ప్రచారం మొదలుపెట్టాడు. భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాకు ఆడియో ఫంక్షన్ లేదంటూ చెప్పి మొట్టమొదటి ప్రచారం దక్కించుకున్నాడు. ఆ తర్వాత పాటల్ని నేరుగా మార్కెట్లోకి విడుదల చేశారు. అక్కడితో ఆగకుండా సెకెండ్ లెవెల్ ప్రచారంలో భాగంగా ఐటెం సాంగ్ బిట్ విడుదల చేశాడు. ఆ తర్వాత మూడో దశలో… ఏకంగా 2 నిమిషాల ఐటెంసాంగ్ క్లిప్ వదిలారు. తర్వాత ప్రీ-రిలీజ్ వేడుక అనే కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నారు. విశాఖలో ఈ వేడుక ఉంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో ఇంకా ప్రకటించలేదు. ఇలా విభిన్నంగా సాగుతోంది సరైనోడు ప్రచారం.
Tags:    
Advertisement

Similar News