వచ్చే నెల నుంచి యుద్ధాలు తప్పవు...
బాహుబలి సినిమాకు సంబంధించి పాత పద్ధతినే మరోసారి ఫాలో అవ్వాలని రాజమౌళి నిర్ణయించాడు. ఇప్పటి వరకు పార్ట్-2కు సంబంధించి కాస్త నెమ్మదిగా షూటింగ్ చేస్తూ వచ్చిన జక్కన్న…. ఈసారి మాత్రం ఏకంగా 45 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అందరూ ఠంచనుగా రావాల్సిందేనంటూ హుకుం జారీచేశాడు. మే 1 నుంచి ఏకథాటిగా 45 రోజుల పాటు బాహుబలి-2కు సంబంధించి యుద్ధసన్నివేశాలు చిత్రీకరించాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు చురుగ్గా […]
Advertisement
బాహుబలి సినిమాకు సంబంధించి పాత పద్ధతినే మరోసారి ఫాలో అవ్వాలని రాజమౌళి నిర్ణయించాడు. ఇప్పటి వరకు పార్ట్-2కు సంబంధించి కాస్త నెమ్మదిగా షూటింగ్ చేస్తూ వచ్చిన జక్కన్న…. ఈసారి మాత్రం ఏకంగా 45 రోజుల భారీ షెడ్యూల్ ప్లాన్ చేశాడు. అందరూ ఠంచనుగా రావాల్సిందేనంటూ హుకుం జారీచేశాడు. మే 1 నుంచి ఏకథాటిగా 45 రోజుల పాటు బాహుబలి-2కు సంబంధించి యుద్ధసన్నివేశాలు చిత్రీకరించాలని జక్కన్న ఫిక్స్ అయ్యాడు. ఇప్పటికే దీనికి సంబంధించి రామోజీ ఫిలింసిటీలో ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆర్ట్ డైరక్షన్ విభాగం అంతా నెల రోజుల్లో సరంజామా సిద్ధం చేయడానికి కసరత్తు చేస్తోంది. మరోవైపు రానా, ప్రభాస్ కూడా రాజమౌళి కోరుకున్న ఫిజిక్ ను సొంతం చేసుకున్నారు. ఏప్రిల్ లో రెండు వారాల పాటు మరోసారి గుర్రపుస్వారీ, కత్తి యుద్ధాన్ని ప్రాక్టీస్ చేసిన తర్వాత మే 1 నుంచి యుద్ధ సన్నివేశాల షూటింగ్ ప్రారంభిస్తారు. పార్ట్-1లో కలిసి యుద్ధం చేసిన ప్రభాస్, రానా… పార్ట్-2లో మాత్రం ఎదురెదురుగా తలపడనున్నారు.
Advertisement